Home

»

Latest News

రాజాసాబ్ రిజల్ట్‌తో సంబంధం లేదు: ప్రభాస్‌తో మరో సినిమా ఫిక్స్.!

Oct 13, 2026 6:55PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ‘ది రాజాసాబ్’ ఫలితం ఎలా ఉన్నా.. ప్రభాస్‌తో తమ బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. ఈ సినిమాను 2028లో చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభాస్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి కలిసి పనిచేయడం ఖాయమైంది.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన హారర్‌ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ఫలితంపై తాజాగా మాట్లాడిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. విడుదలకు సరైన సీజన్‌ను ఎంచుకోవడంలో జరిగిన పొరపాటే ఒక కారణమని అభిప్రాయపడ్డారు.

‘ది రాజాసాబ్’ ఫలితం తమ తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపదని టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. 2028లో ప్రభాస్‌తో కచ్చితంగా మరో సినిమా చేయబోతున్నామని ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరు? కథ ఏంటి? ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ చిత్రాలు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో 2028లో ప్రభాస్‌తో సినిమా చేయనున్నట్లు టీజీ విశ్వప్రసాద్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఇది కూడా చదవండి: జిమ్ జిమ్ తార.. సోషల్ మీడియాను షేక్ చేసిన పాట‌.. ఫుల్ సాంగ్ వచ్చేసింది.!

 

 

 

[Prabhas People Media Factory Movie, Prabhas TG Vishwa Prasad Movie, Prabhas New Movie, Prabhas Upcoming Movies, The Raja Saab Movie, Fauzi Movie, Spirit Movie, Kalki 2 Movie, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com