Home

»

Latest News

‘సలార్ 2’ అప్‌డేట్: ప్రభాస్‌, ప్రశాంత్ నీల్ రీయూనియన్.. ఒక్క ఫొటోతో మళ్లీ పెరిగిన హైప్.!

Oct 23, 2026 3:04PM

ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు మరో ఆసక్తికరమైన ట్రీట్‌ ఇచ్చింది ‘సలార్’ టీమ్. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ఉన్న ప్రభాస్‌ ఫొటోను షేర్ చేస్తూ.. ఈ ఇద్దరి కాంబోని మళ్లీ చూడటానికి ఎదురుచూస్తున్నామని హింట్ ఇచ్చింది. దీంతో ‘సలార్ 2’పై మరోసారి చర్చ మొదలైంది.

“మన వైలెంట్ మ్యాన్‌ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ డైనో-మైట్ జోడీని మళ్లీ యాక్షన్‌లో చూడటానికి ఎదురుచూస్తున్నాం” అనే అర్థం వచ్చేలా మేకర్స్ చేసిన పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ పోస్ట్‌లో ‘సలార్ 2’ను కూడా ప్రస్తావించడంతో సీక్వెల్‌పై అంచనాలు మళ్లీ ఊపందుకున్నాయి.

ప్రభాస్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకుంది. ఖాన్సార్ నేపథ్యం, దేవా–వరదల స్నేహం, అధికారం కోసం జరిగే పోరాటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మొదటి భాగం ముగింపులో ఇచ్చిన కీలక ట్విస్ట్‌తో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి.

‘సలార్ 2’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చేసిన ఈ పోస్ట్ సీక్వెల్‌పై ఉత్సాహాన్ని పెంచింది.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమాపై పనిచేస్తుండగా, ప్రభాస్‌ చేతిలో ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సినిమాల షెడ్యూళ్ల నేపథ్యంలో ప్రభాస్‌, ప్రశాంత్ నీల్ మళ్లీ ఎప్పుడు కలిసి పనిచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి, ‘సలార్’ టీమ్ పెట్టిన ఒక్క బర్త్‌డే పోస్ట్‌తో అభిమానుల్లో సీక్వెల్‌పై ఆశలు మరోసారి చిగురించాయి. అయితే ఈ రీయూనియన్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుంది? ‘సలార్ 2’పై తదుపరి అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది? అన్నది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. నంబర్ 1 ఏదో తెలుసా.?

 

 

 

[Prabhas Salaar 2 Update, Prabhas Prashanth Neel Reunion, Prabhas Birthday, Happy Birthday Prabhas, Salaar Sequel, Prabhas, Prashanth Neel, Salaar 2, NTR Dragon, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com