నేను ఆరోగ్యంగానే ఉన్నాను: ప్రభాస్
on Nov 29, 2013
"బాహుబలి" చిత్ర షూటింగ్ లో హీరో ప్రభాస్ కు తీవ్ర గాయాలయ్యాయని వార్తలు వస్తుండటంతో తన అభిమానులు కంగారు పడుతున్నారని ప్రభాస్ స్వయంగా తన ఆరోగ్య పరిస్తితి గురించి ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు. ఫేస్ బుక్ ద్వారా ప్రభాస్ " నాకెలాంటి ప్రమాదం జరగలేదు. అనవసరంగా కంగారు పడకండి. నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు దెబ్బలు తగిలాయని తెలిసి నా అభిమానులు కంగారు పడుతున్నారు. అంతటి ప్రేమ చూపుతున్న అభిమానులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రస్తుతం "బాహుబలి" షూటింగ్ కేరళలో చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు మీ ముందుకొస్తానా అని ఎదురుచూస్తున్నాను" అని తెలియజేసారు.