డిసెంబర్ లో ప్రతినిధి హవా
on Nov 27, 2013
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ప్రతినిధి". సుధా సినిమాస్ బ్యానర్లో జె.సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రశాంత్ మాండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శుభ్ర అయ్యప్ప హీరోయిన్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదల చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన పాటలకు, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తుంది. నేటి రాజకీయాలపై ఒక బ్రహ్మాస్త్రంగా వస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.