Home

»

Latest News

‘డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్ 25’ .. ఒక్క పోస్టర్‌తో ‘ఫౌజీ’పై పెరిగిన అంచనాలు.!

Oct 23, 2026 12:08PM

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ‘ఫౌజీ’ చిత్ర బృందం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదల చేసిన ఇంటెన్స్ పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతోంది. ‘హూ ఈజ్ హి?’ అనే ప్రశ్నతో విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

ప్రభాస్‌ మిలటరీ అవతారాన్ని చూపిస్తూ రూపొందించిన ఈ పోస్టర్‌ వింటేజ్ డిజైన్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అగ్నికీలల మధ్య బంగారు నాణెంపై ప్రభాస్‌ సైడ్‌ ప్రొఫైల్‌ను పవర్‌ఫుల్‌గా చూపించారు. ‘ఫైల్ నంబర్ 25 డీక్లాసిఫై చేస్తున్నాం’, ‘ఒంటరిగా పోరాడే బెటాలియన్’, ‘1939 నుంచి మోస్ట్ వాంటెడ్’ వంటి క్యాప్షన్లు ఈ పోస్టర్‌లో ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రభాస్ పాత్ర వెనుక ఉన్న అసలు కథ ఏమిటనే ఉత్కంఠను ఇవి పెంచుతున్నాయి.

‘సీతారామం’తో క్లాసిక్ ప్రేమకథను తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చరిత్రలో మరుగునపడిన ఓ సైనికుడి కథాంశంతో ఈ పీరియడ్ డ్రామా రూపొందుతోంది. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. ‘అతను ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానంగా విడుదల చేయనున్న క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

[Prabhas Birthday, Fauji Movie, Prabhas Fauji Poster, Hanu Raghavapudi, Prabhas Military Look, Fauji Movie Update, Prabhas Upcoming Movies]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com