Home

»

Latest News

418 Movie Review Telugu: 418 మూవీ రివ్యూ 

Oct 23, 2026 12:00PM

 

 

-సినిమా పేరు: 418
-న‌టీన‌టులు: చైత్ర అచార్, ప్రీతీ పగడాలచరణ్ లక్కరాజు, సూర్య రాజ్, శశాంక్ పాటిల్, శ్రీ వైష్ణవ్  తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: దినేష్ దివాకరన్ 
-ఎడిటింగ్: అవినాష్ 
-మ్యూజిక్: వెంకీ జిజి
-నిర్మాత‌లు:  యలమంచిలి రవి శంకర్, నవీన్ ఎర్నేని,  
-బ్యానర్ :మైత్రి మూవీ మేకర్స్ 
-సమర్పణ: ప్రశాంత్ నీల్
-రచన,దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ
-రిలీజ్ డేట్ : అక్టోబర్ 23 , 2026 

పాన్ ఇండియా బ్యానర్  మైత్రి మూవీ మేకర్స్, సలార్, డ్రాగన్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కలిసి ఈ రోజు 418 మూవీతో సెల్యులాయిడ్ పైకి వచ్చారు. పక్కా హర్రర్ థ్రిల్లర్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.  

కథ
దట్టమైన అడవిని తలపించేటట్లుగా ఉండే 'వేదగిరి' అనే ఏరియాలో ఒక  మెడికల్ కాలేజీ.  ఆ కాలేజీ బాయ్స్ హాస్టల్ లో 418 రూమ్ నెంబర్ చాలా సంవత్సరాల నుంచి లాక్ చేసి ఉంటుంది. ఏ ఆడపిల్లైనా బాయ్స్ హాస్టల్ లోకి అడుగుపెట్టిందా, ఇక అంతే సంగతులు, 418 రూమ్ నెంబర్ లో ఉన్న అదృశ్య శక్తీ తన మృత్యు వేటని స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ  పదిమందిని అత్యంత దారుణంగా హతమార్చింది. పక్షులు సైతం తిండి గింజలు హాస్టల్ గేటు బయటనే తింటాయి కానీ లోపలకి వెళ్లవు. దీన్ని బట్టి 418 లో ఉన్న అదృశ్య శక్తీ ప్రభావం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.  418 లో ఉంది ఎవరు? ఆడవాళ్లు లోపలకి వస్తే ఎందుకు మృత్యు వేటని స్టార్ట్ చేస్తుంది? తనకి ఏమైనా కథ ఉందా? ఉంటే ఆ కథ మంచిదా? చెడ్డదా? మిగతా క్యారెక్టర్ల కథ ఏంటి? అసలు 418 లో ఉన్న అదృశ్య శక్తీ లక్ష్యం ఏమిటి? అది నెరవేరిందా? లేదా అనేదే 418 మూవీ .

ఎనాలసిస్ 
కథగా చూసుకుంటే మొదటి నుంచి చివరి వరకు క్యూరియాసిటీ కలిగించే కథే. కానీ పరిమిత బడ్జెట్ ని మేకర్స్ ఎంచుకోవడం వల్ల 418 రేంజ్ కొంచం తగ్గింది. పైగా కీలకమైన సీన్స్ ని సింపుల్ గా తేల్చేసారు. ఉదాహరణకి  418 రూమ్ లో ఉన్న దుష్ట   దెబ్బకి భయపడే మెడికల్ కాలేజీ స్టూడెంట్  చాలా సింపుల్ గా కొన్ని క్లూస్ సంపాదిస్తాడు. అలా కాకుండా కొంచం టైం గ్యాప్ ఇచ్చి అనేక అవాంతరాల మధ్య కనుకున్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సిందేమో. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన  ఇలాంటి లోపాలాన్ని సెకండ్ హాఫ్ బాగుండటంతో పెద్దగా ఇబ్బందిగా అనిపించవు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఎంట్రీ సీన్ లో జరిగే మారణకాండ కొంచం భయం కలిగిస్తుంది. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ కలుగుతుంది.అందుకు తగ్గటే స్టూడెంట్స్ వివేక్, రోహిత్ , సాషా,మ్యాగీ అండ్ మరో స్టూడెంట్ మధ్య వచ్చిన  సరదా, టెన్షన్  సీన్స్ బాగున్నాయి. కాకపోతే భయపడేది ఏమి ఉండదు. వివేక్, రోహిత్ ఆపోజిట్ కోణంలో ఆలోచిస్తారు కాబట్టి, ఆ ఇద్దర్ని,గదిలో ఉన్న అదృశ్య శక్తీ మధ్య టెన్షన్ తెప్పించే సీన్స్ సృష్టించాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో దేవిక సీన్స్ అన్ని సూపర్. ముఖ్యంగా ఒక బిడ్డకి జన్మనిచ్చి తల్లి అవ్వడం కోసం తాను తీసుకున్న నిర్ణయం తాలూకు సీన్స్ బాగున్నాయి. కానీ దేవిక కి వేరే ఛాయిస్ లేదు, బిడ్డ కావాలంటే తను చెప్పింది చేయాల్సిందే అని ఒక శక్తీ చెప్పే తీరుని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఎందుకంటే టోటల్ కథకి ఆ నిర్ణయమే కీలకం కాబట్టి. చివరి ఇరవై నిముషాలు చాలా బాగుంది. క్లైమాక్స్ లో సాషా, దేవిక కి మధ్య ఇచ్చిన ట్విస్ట్ తాలూకు ఇంపాక్ట్ ని సాషా క్యారక్టర్ ఎంట్రీ దగ్గర నుంచే ఇస్తూ ఉండి ఉంటే 418 కి మరింతగా ప్లస్ అయ్యేది.     


నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు:
దేవిక గా చైత్ర అచార్ పలు పార్శ్యాలు ఉన్న షేడ్స్ లో అత్యద్భుతంగా పోషించింది. జాలిపడేలా , తిట్టుకునేలా, భయపడేలా ఇలా మూడు జోనర్స్ లో మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో నో కాంప్రమైజ్.రోహిత్ గా చేసిన చరణ్ లక్కరాజు, వివేక్ గా చేసిన సూర్య రాజ్, సాషాగా చేసిన ప్రీతీ పగడాల మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. కీర్తన్ నాద గౌడ  దర్శకుడుగా సక్సెస్. రచయితగా ఒక మోస్తరుగా మెప్పించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ, మైత్రి మూవీ మేకర్స్  ప్రధాన బలం.  

బలాలు

1 . కథ
2 . సెకండ్  హాఫ్ 
3 .నటీనటుల పెర్ఫార్మెన్స్ 
4 . డైరెక్షన్ 

బలహీనతలు 
1 . పెద్దగా బయపెట్టకపోవడం 
2 . కథనంలోని కొన్ని లోపాలు
 

చివరిగా చెప్పాలంటే 418 ఒక మోస్తరుగానే మెప్పించింది.

రేటింగ్ 2 .5 /5                                                                                       అరుణాచలం  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com