'పొన్నియిన్ సెల్వన్'కు అదిరిపోయే ఓపెనింగ్స్
on Oct 1, 2022
ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో ఒకటైన మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' మూవీ సెప్టెంబర్ 30న విడుదలైంది. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించిన 'విక్రమ్ వేద' మూవీ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశంలోనూ, విదేశాలలోనూ 'పీఎస్-1' అసాధారణమైన ఓపెనింగ్‌ను చూసిందని ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి.
'పొన్నియిన్ సెల్వన్'లో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. తొలి బాక్సాఫీస్ అంచనాల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు అనూహ్యమైన కలెక్షన్లను సాధించింది. ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాలా "బాక్సాఫీస్ వద్ద #పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1కి అనూహ్యమైన ఓపెనింగ్ వచ్చింది. #వలిమై తర్వాత ఈ చిత్రం తమిళనాడులో 3వ అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లను సునాయాసంగా రాబట్టింది. #బీస్ట్. #పొన్నియిన్ సెల్వన్1 (sic)." అని రాసుకొచ్చాడు. మరో ట్వీట్లో, "#PS1 2022లో WW బాక్స్ ఆఫీస్ వద్ద తమిళ సినిమా విషయంలోబిగ్గెస్ట్ డే 1 ఓపెనింగ్‌ను సాధించింది (sic)" అని రాశాడు.
'పొన్నియిన్ సెల్వన్' తమిళ చలనచిత్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్ అవుతుందని విడుదలకు ముందే ప్రచారంలోకి వచ్చింది. రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాల ఫ్రాంచైజీగా ఈ సినిమాని మణిరత్నం తెరకెక్కించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, రవివర్మన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, తోట తరణి కళా దర్శకత్వం అందించారు. ఐమాక్స్‌లో విడుదలైన తొలి తమిళ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ నిలిచింది.
Also Read