Home

»

Latest News

పవన్ ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్: అసలు ఎవరైనా ఊహించారా!

Oct 21, 2026 7:25PM


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కట్ అవుట్ కి ఉన్న వేడి తగ్గే పనే లేదంటూ ప్రీవియస్ మూవీ 'ఓజి' సృష్టించిన విజయం తెలిసిందే. పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించి ఫ్యాన్స్ కి బెస్ట్ ఆల్బమ్ గా కూడా నిలిచింది.

అయితే, మొదటి భాగం ముగిసినప్పటి నుంచి  ఎప్పుడెప్పుడు పార్ట్ 2 షూట్ కి వెళ్తుందా అని వాళ్లంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తూ వస్తున్నారు.దీంతో  తదుపరి భాగం షూటింగ్, లైనప్ వివరాలపై మేకర్స్ నుంచి స్పష్టమైన క్లారిటీ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలలో ‘#OG2’ మరియు ‘#OG2Update’ హ్యాష్‌ట్యాగ్‌లతో  అప్డేట్ ఇవ్వాలని  డిమాండ్ చేస్తున్నారు.   


ఇది కూడా చదవండి: అఖిల్ అక్కినేని నెక్స్ట్ మూవీ అప్‌డేట్: ఫ్యాన్స్ ఆనంద బాష్పాలు!

 


 దర్శకుడు సుజీత్ ప్రస్తుతం నాచురల్ స్టార్ నానితో ప్రాజెక్ట్ పనిలో ఉన్నాడని  మరోవైపు పవన్ కళ్యాణ్ తన పొలిటికల్, డెవలప్‌మెంట్ షెడ్యూల్స్ తర్వాత డేట్స్ కేటాయించాల్సి ఉండటంతో సెట్స్‌పైకి వెళ్లడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందనేది సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఏది ఏమైనా అభిమానుల కోసం అప్ డేట్ ఇస్తే బాగుండు అనేది సినీ అభిమానుల, విశ్లేషకుల అభిప్రాయం.

 

 

[Pawan Kalyan Og 2 Update, Pawan Kalyan Fans ABout Og2, Pawan Kalyan OG 2, OG Sequel Update, Director Sujeeth OG2, OG Movie Box Office, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com