
అభిమానుల ముఖాల్లో చిరునవ్వు నింపుతు అఖిల్ అక్కినేని లెనిన్ తో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గుంటూరు, విజయవాడ లో అయితే చాలా మంది ఫ్యాన్స్ అఖిల్ హిట్ అందుకున్నాడంటూ కన్నీళ్లుని తమ గుండెల్లో నింపుకొని ర్యాలీలు కూడా చేసారంటే అఖిల్ అనే కట్ అవుట్ అభిమానులకి,తెలుగు సినిమాకి ఎంత ఇంపార్టెంట్ కట్ అవుట్ నో అర్ధం చేసుకోవచ్చు.
'లెనిన్' ప్రమోషన్ల సమయంలోనే అఖిల్ తన ఫ్యాన్స్‌కి ఒక ముఖ్యమైన మాటిచ్చారు. ఇకపై సినిమాల మధ్య ఎలాంటి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, జెట్ స్పీడ్ తో వరుస ప్రాజెక్ట్‌లతో మీ ముందుకు వస్తానని చెప్పాడు. ఈ భారీ విజయం అందించిన ఆత్మవిశ్వాసంతో అఖిల్ తన తదుపరి చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం ఆయన రెండు విభిన్న కథలను ఫైనల్ చేసి, వాటిలో ఒక దానిని లాక్ చేసే పనిలో ఉన్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున, నాగచైతన్యతో కలిసి అఖిల్ నటించబోతున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ నయా అప్ డేట్ ఇదే!

అయితే, సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పుకార్లను చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఇటీవల దర్శకుడు పవన్ సాదినేనితో అఖిల్ నెక్స్ట్ మూవీ ఉంటుందంటూ వచ్చిన వార్తలను మేకర్స్ అధికారికంగా తోసిపుచ్చారు. ఏది ఏమైనా, 'లెనిన్' వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత అఖిల్ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగార్జున గారి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడితేనే అసలు క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా అఖిల్ తదుపరి చిత్రం ఏ జోనర్‌లో ఉండబోతోంది, ఎవరి దర్శకత్వంలో తెరకెక్కనుంది అనే విషయాలపై అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
[Akhil Akkineni Next Movie Update, Akhil Akkineni, Lenin movie, Akhil next project, Tollywood news, Nagarjuna, Akkineni updates, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






