ఈనెల 11న పాండవుల పాటల సందడి
on Jan 8, 2014
మంచు కుటుంబం కలిసి నటిస్తున్న "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 11న విడుదల కానుంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బప్పిలహరి, కీరవాణి, మణిశర్మ, అచ్చు సంగీతం అందిస్తున్నారు. ఇందులో మోహన్ బాబు, మనోజ్, విష్ణు, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. రవీనా టాండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయనున్నారు.