ENGLISH | TELUGU  

మహేష్ 1 కథ లీకయ్యిందంట...!

on Jan 9, 2014

 

మహేష్ సినీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన "1నేనొక్కడినే" చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14రీల్స్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ చిత్ర కథ లీకయ్యిందని వార్తలు వస్తున్నాయి. అసలు మరి ఆ లీకయిన కథ ఏమిటో చూద్దామా..!

మహేష్ చిన్నతనంలో తన తల్లిదండ్రులను ఎవరో కొందరు వ్యక్తులు చంపేస్తారు. కానీ ఎవరు చంపారో మహేష్ కు కూడా తెలియదు. అయితే అనాధగా పెరిగి పెద్దవాడైన మహేష్ రాక్ స్టార్ గా మారుతాడు. ఆ క్రమంలోనే హీరోయిన్ తనని ప్రేమించమని వెంటపడుతుంది. కానీ మహేష్ ప్రేమకు దూరంగా ఉంటాడు. అనుకోకుండా హీరోయిన్ ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. తనకు సహాయం చేస్తాడు. ఈ ప్రయత్నంలో మహేష్ హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. అయితే హీరోయిన్ కు విలన్ల నుండి మరింత సమస్య ఎక్కువ అవుతుంది. దాంతో మహేష్ హీరోయిన్ కు అండగా ఉంటాడు. ఈ క్రమంలో హీరో విలన్లకు ఎదురుతిరగడంతో ... హీరోయిన్ ను విలన్లు కిడ్నాప్ చేస్తారు. అపుడు హీరోయిన్ కోసం మహేష్ వేట మొదలుపెడతాడు. చివరికి మహేష్ విలన్లను చితక్కొట్టి, తన ప్రేమను దక్కించుకుంటాడు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.