Home

»

Latest News

గానకోకిల సుశీలమ్మ జీవితం వెండితెరపైకి.. టైటిల్ రోల్‌లో మీ అభిమాన హీరోయిన్!

Oct 21, 2026 3:20PM

 

సుశీలమ్మ పాట వినాలంటే పెట్టి పుట్టాలనే సామెత వినిపిస్తూ ఉంటుంది. కోయిల సైతం చిన్నబోయే ఆ గొంతు నుంచి సుమారు వివిధ భాషల్లో కలిపి సుమారు నలభై వేల వరకు వచ్చాయి. దాదాపుగా అన్ని కూడా అమరత్వాన్ని నింపుకున్నవే.  ఇప్పుడు ఆ గాన కోకిల సుశీలమ్మ  జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో ఓ  బయోపిక్ రాబోతోందంటూ సినీ వర్గాల్లో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.


 .
 సుశీలమ్మ టైటిల్ రోల్‌లో కన్నడ బ్యూటీ డ్రాగన్ ఫేమ్ 'రుక్మిణి వసంత్' పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుశీలమ్మ ముఖంలో కనిపించే సహజమైన అమాయకత్వం, అచ్చమైన క్లాసిక్ లుక్స్, మహోన్నత వ్యక్తిత్వ లక్షణాలు వంటి అన్ని కోణాలను తెరపై అత్యంత సహజంగా పండించేందుకు రుక్మిణి వసంత్ సరైన ఛాయిస్ అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే కనుక నిజమైతే అభిమానులు, సినీ ప్రేమికుల అంత అదృష్ట వంతులు ఉండరు.  ఇప్పటికే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ తరహాలోనే సుశీలమ్మ బయోపిక్ పై కూడా భారీ అంచనాలు నెలకొనగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇది కూడా చదవండి: దలేర్ మెహందీ ఆల్కహాల్ తాగాడా:  ఆరోగ్యంపై అనుపమ్ ఖేర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 


ఈ ప్రాజెక్ట్ వెనుక ఆస్కార్ అవార్డు విజేత, మ్యూజిక్ మాస్ట్రో ఏ.ఆర్. రెహమాన్ పేరు వినిపించడం  ఆశ్చర్యానికి, అంతులేని ఉత్సాహానికి గురిచేస్తోంది. సుశీలమ్మ గళంపై మక్కువతో, ఆమె కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా బయోపిక్ ని  రెహమాన్ స్వయంగా నిర్మించనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది.

 

[P susheela Biopic Movie Details, Rukmini Vasanth In P susheela Biopic, P Susheela Biopic, Rukmini Vasanth, AR Rahman, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com