
లిటిల్ హార్ట్స్ సినిమాతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్.. ఇప్పుడు దొంగ నా కొడుకు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
టీజర్ ప్రారంభంలో సముద్రం ఒడ్డున మౌళి నిల్చొని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. "దేవుడా నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చావు. మంచి ఫ్రెండ్ ని ఇచ్చావు. అడక్కుండానే అన్నీ ఇచ్చావు. కానీ వచ్చే జన్మలో ఇవేం వద్దు.. అడిగిన డబ్బులివ్వు చాలు" అంటూ హీరోకి డబ్బు పిచ్చి ఉందని తెలిపేలా ఆ పాత్రను సరదాగా పరిచయం చేశారు.
చదువు మధ్యలోనే ఆపేసి, అప్పులు చేస్తూ, తల్లిదండ్రుల చేత తిట్లు తింటూ, అవసరమైన తలనొప్పులు తెచ్చుకునే యువకుడిగా మౌళి పాత్ర నవ్వులు పంచుతోంది. మొత్తానికి డబ్బుల చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ కథతో మౌళి మరోసారి బాగానే నవ్వించేలా ఉన్నాడు.
సుష్మిత శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ, రజిత, రఘుబాబు, ప్రియ, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సింజిత్ యర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు.
మౌళి నుంచి మరోసారి వినోదాన్ని ఆశిస్తున్న ప్రేక్షకులకు దొంగ నా కొడుకు ఆసక్తి కలిగించే ప్రాజెక్ట్. క్రైమ్ కామెడీ నేపథ్యం, మౌళి కామెడీ టైమింగ్, కథలో ఉండబోయే ట్విస్టులు సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా మారే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: డీ కంపెనీ కంటే డేంజర్.. 319 మంది గ్యాంగ్‌స్టర్ల ఎన్‌కౌంటర్లు.!
[Donga Naa Koduku Teaser, Donga Naa Koduku Movie, Mouli Tanuj Prashanth, Sushmitha Shetty, Mythri Movie Makers, Sinjith Yerramilli, Little Hearts, Sreenu Kambala, Telugu Film News]






