వేటాడి మరి ఇస్తా అంటున్న ఎన్టీఆర్
on May 16, 2025
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడైన హృతిక్ రోషన్(Hrithik Roshan)ట్వీట్ చేస్తు 'ఎన్టీఆర్ పుట్టిన రోజుకి సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టుగా తెలిపాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అనే ఆసక్తి మొదలైంది.
రీసెంట్ గా ఈ ట్వీట్ కి ఎన్టీఆర్ రిప్లై ఇస్తు 'కబీర్ నిన్ను వేటాడి, నీకు ప్రత్యేక బహుమతి ఇచ్చేందుకు వేచి చూస్తున్నాను అని ట్వీట్ చేసాడు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ ఇద్దరు కలిసి వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న అతి పెద్ద మల్టిస్టారర్ గా వార్ 2(War 2)తెరకెక్కుతుంది.దీంతో వార్ 2 నుంచి ఎన్టీఆర్ లుక్ ని రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది.
ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వార్ 2 ని నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు కాగా ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. 2019 లో హృతిక్ రోషన్, టైగర్ ష్రఫ్ నటించిన వార్ కి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
