ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా
on Nov 22, 2022

సినిమా సినిమాకి విభిన్న లుక్ తో ఆకట్టుకునే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలో ఎలా కనిపించబోతున్నాడోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే తాజాగా ఎన్టీఆర్ స్టైలిష్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇది తారక్ కెరీర్ లో 30వ సినిమా. ఈ మూవీ లాంచ్, ఎన్టీఆర్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మూవీ టీమ్ మాత్రం కేవలం పోస్ట్ ప్రొడక్షన్ అప్డేట్స్ తో సరిపెడుతోంది. 'ఎన్టీఆర్ 30' కీలక అప్డేట్స్ రాక నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోలు ఫుల్ కిక్ ఇస్తున్నాయి.
'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ కి వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి పలు బ్రాండ్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో లీసియస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి తారక్ సైన్ చేశాడు. ఈ యాడ్ షూట్ ఇటీవల జరగగా.. అందులో తారక్ లుక్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూట్, కళ్ళద్దాలతో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. యాడ్ లోనే తమ హీరో లుక్ ఇలా ఉందంటే.. ఇక 'ఎన్టీఆర్ 30'లో ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



