
-ముస్తాబవుతున్న సరస్వతి
-ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు
-సెల్యులాయిడ్ పై భారీ తారాగణం
-వరలక్ష్మి శరత్ కుమార్ ఏమంటుంది
సౌత్ సినీ పరిశ్రమకి దొరికిన అరుదైన మంచి నటీమణుల్లో 'వరలక్ష్మి శరత్ కుమార్'(varalaxmi sarathkumar )కూడా ఒకరు.క్యారక్టర్ ఏదైనా సరే తన చరిష్మాని చాలా బలంగా చాటగలదు. ఎంత బలంగా అంటే టోటల్ సినిమాకే ప్లస్ పాయింట్ అయ్యేంతలా. అందుకే వరలక్ష్మి శరత్ కుమార్ తమ సినిమాలో ఉండాలని కోరుకొని మేకర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు.అంతటి క్రేజ్ ఉన్న వరలక్మి శరత్ కుమార్ తాజాగా తన అప్ కమింగ్ సినిమా ఫంక్షన్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది.
వరలక్ష్మి శరత్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'సరస్వతి'(Saraswathi).దర్శకత్వ బాధ్యతలని కూడా తనే చేపట్టింది. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగగా వీరసింహ రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వరలక్షి కన్నీళ్లు పెట్టుకుంటు సరస్వతి గుడ్ సినిమా. బాగా ప్రమోట్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాం.ఒక అమ్మాయిగా ఈ ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం. ఇండస్ట్రీ లో ఆడవాళ్లు ముందుకెళ్లడానికి అందరు సపోర్ట్ చెయ్యండని చెప్పుకొచ్చింది.
also read: ఇద్దరిలో హీరో ఎవరు! మీకైనా తెలుసా
ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉండటంతో పాటు డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కినట్టుగా అర్ధమవుతుంది.ప్రకాష్ రాజ్,రాధికా శరత్ కుమార్, ప్రియమణి, నాజర్ కీలకమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. ఈటీవీ విన్, దోశ డైరీ సంయుక్తంగా నిర్మించగా రిలీజ్ డేట్ ని త్వరలోనే రానుంది. థమన్(Thaman)మ్యూజిక్ ని అందించడం విశేషం.







.webp)
