Home

»

Latest News

డ్రాగన్ అప్ డేట్ ఇదే: ఫ్యాన్స్ ఖుషి!

Oct 15, 2026 11:53AM

 

అభిమానులు, ప్రేక్షకులతో పాటు సెల్యులాయిడ్ ఎన్టీఆర్ వన్ మాన్ షో డ్రాగన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుండగా, తాజాగా మేకర్స్  షూటింగ్ కార్యక్రమాలని స్పీడ్ అప్ చేస్తున్నారు. ముఖ్యంగా, సినిమాలోని కీలకమైన అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది.

ప్రపంచ స్థాయి హంగులతో, సరికొత్త విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్నడ్రాగన్ లో  భారీ సెట్టింగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం సాధారణ తారాగణంతో కాకుండా, దాదాపు వేల సంఖ్యలో కళాకారులు మరియు ప్రత్యేక జూనియర్ ఆర్టిస్టులతో ఈ షెడ్యూల్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్న ఈ రక్తపాత దృశ్యాలు, ఎన్టీఆర్ మాస్ ఎనర్జీ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 


ఇది చదవండి: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఆ సిటీలో లాస్ట్ పంచ్!

 


ఇప్పటికే  విడుదలైన గ్లింప్స్ వీడియో కేవలం 24 గంటల్లోనే ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి ఆల్‌టైమ్ రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రికార్డుతోనే డ్రాగన్ రేంజ్ ఏంటో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు స్పష్టమైంది. ఇక రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న ఈ తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొని తన విలక్షణ నటనతో సెట్స్‌పై సందడి చేస్తున్నాడు . దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, సలార్ ని ను మించి డ్రాగన్ ని హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.ఎన్టీఆర్ తో పాటు రుక్మిణి వసంత్   అనిల్ కపూర్,  బిజు మీనన్ ఉండగా సూపర్ హిట్ పెద్ద కష్టమైన పని కాదు.

 

 

[Ntr Dragon Shooting At Ramoji Film City, Jr NTR Dragon, Prashanth Neel movie, Ramoji Film City shoot, Dragon movie updates, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com