2021లో నిహారిక పెళ్లి!
on May 15, 2020
2016లో 'ఒక మనసు' మూవీతో తెరంగేట్రం చేసింది నాగబాబు ముద్దుల తనయ నిహారిక. ప్రస్తుతం సినిమాలతో కాకుండా పెళ్లి విషయంలో ఆమె వార్తల్లో నిలుస్తోంది. యువ హీరో నాగశౌర్యతో ఆమె వివాహం జరగనున్నదని కొంతకాలం, ఆమెను బాహుబలి ప్రభాస్ పెళ్లాడనున్నాడని ఇంకొంత కాలం ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలను ఆమె ఖండించింది. కాగా, ఆమె పెళ్లి గురించి ఇటీవల నాగబాబు స్పందించారు. ఆమె పెళ్లి గురించే కాదు, వరుణ్ తేజ్ పెళ్లి విషయాన్నీ ఆయన ప్రస్తావించడం గమనార్హం.
వచ్చే ఏడాది సాధ్యమైనంత త్వరలో నిహారిక వివాహం జరిగే అవకాశాలున్నాయని మెగా బ్రదర్‌గా ఫ్యాన్స్ పిలుచుకొనే నాగబాబు వెల్లడించారు. ఆమె కోసం సంబంధాలను చూస్తున్నట్లు ఆయన చెప్పారు. 2021 మార్చి లేదా ఏప్రిల్ నెలలో నిహారికకు పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతే కాదు, వరుణ్ తేజ్ వివాహ ప్రస్తావన కూడా ఆయన తెచ్చారు. నిహారిక పెళ్లయ్యాక వరుణ్‌కు కూడా పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు. తన ఇద్దరు పిల్లల పెళ్లిళ్లయిపోతే తను పూర్తిగా ఫ్రీ అయిపోతానని నాగబాబు చెప్పారు.
మెగాస్టార్ మునుపటి మూవీ 'సైరా.. నరసింహారెడ్డి'లో ఒక అతిథి పాత్రలో కనిపించిన నిహారిక త్వరలో ఒక తమిళ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
