
-షూటింగ్ కి వెళ్ళబోతున్న NBK111
-వీర సింహారెడ్డి కాంబో కావడంతో భారీ అంచనాలు
-సంక్రాంతి దాకా జాతర పక్కానా!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna).. ఈ పేరు వింటే చాలు నందమూరి అభిమానులకి, తెలుగు సినిమా ప్రేక్షకులకి పూనకాలు వస్తాయి. అందుకు కారణమైన సినీ హిస్టరీ బహిరంగ రహస్యమే. హిట్ లకి మొహమాసిన రోజుల్లో అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ విజయాలతో బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడుకున్నాడు. ప్రీవియస్ మూవీ అఖండ 2 తో కొంచం తగ్గినట్టుగా అనిపించినా కలెక్షన్స్ పరంగా మాత్రం తన కట్ అవుట్ కి ఉన్న వేడి తగ్గలేదు. ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమాతో (NBK111) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. వీరసింహ రెడ్డి ఫేమ్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni)దర్శకుడు కావడంతో అంచనాల స్థాయిని కొలవడానికి సరికొత్త పరికరాల్ని కనిపెట్టాల్సిన పరిస్థితి. తాజాగా ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన ఆసక్తికరమైన అప్‌డేట్స్ మీ కోసం.
ఈ నెల ఐదు లేదా తొమ్మిదవ తారీకు నుంచి హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ప్రారంభం కానుంది,. మొదటి షెడ్యూల్‌లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికనే తమ స్థిర నివాసంగా ఏర్పాటు చేసుకొని మరిన్ని అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వాళ్లందరికీ తాజాగా మరో గుడ్ న్యూస్ ఏంటంటే మేకర్స్ తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ అభిమానులని ఎక్కువ కాలం వేచి చూడనివ్వకూడదనే ఉద్దేశ్యంతో దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించింది. దసరా నుంచి సంక్రాంతి వరకి థియేటర్లలో బాలయ్య వేట కొనసాగేలా ఉండాలనేది వాళ్ళ ప్లాన్. దీన్ని బట్టి మేకర్స్ కి మూవీపై ఉన్న నమ్మకాన్ని అర్ధం చేసుకోవచ్చు.
'వీరసింహారెడ్డి'లో బాలయ్యను పవర్ ఫుల్ 'సాల్ట్ అండ్ పెప్పర్' లుక్‌లో చూపించి మెప్పించారు. ఈసారి అంతకు మించి ఉండబోతోందని తెలుస్తోంది. డ్యూయల్ రోల్ కాకపోయినప్పటికీ నాలుగైదు విభిన్నమైన గెటప్స్‌లో బాలయ్య కనిపించబోతున్నాడని, సదరు క్యారెక్టర్‌లో ఉండే వేరియేషన్స్ ప్రేక్షకులకి సర్ ప్రైజింగ్‌గా ఉంటాయని తెలుస్తోంది. ప్రతి గెటప్ హైలైట్‌గా నిలుస్తుందని టాక్. కథాంశం టోటల్ యాక్షన్ డ్రామాతో కూడిన మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ముంబై లేదా మరేదైనా విభిన్నమైన లొకేషన్లలో సినిమా నేపథ్యం ఉండవచ్చు. ఏ మూవీలో అయినా సరే బాలయ్య నోటి నుంచి డైలాగ్స్ సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తాయనే విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టే ఈ మూవీలో కూడా అభిమానులు ఆశించే రేంజ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండబోతున్నాయి. గత కొంతకాలంగా బాలయ్య సినిమాల్లో మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ని కూడా బలంగా ఉండేలా గోపీచంద్ మలినేని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సినీ సర్కిల్ ఫ్రెష్ టాక్ .
also read: మన శంకర వర ప్రసాద్ 50 డేస్ సెంటర్స్ ఇవే.. బాలకృష్ణకి కృతజ్ఞతలు
ఈ భారీ ప్రాజెక్టులో బాలయ్య సరసన నయనతార(NayanThara)హీరోయిన్ గా చేస్తుందనట్టుగా తెలుస్తుంది. 'వీరసింహారెడ్డి'లో తన నటనతో మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఆమెతో పాటు ఉదయభాను లేదా మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
మొత్తానికి, NBK111 సినిమాతో బాలయ్య బాబు మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి వస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్, మరియు బాలయ్య మార్క్ ఎంటర్టైన్మెంట్ కలగలిసిన ఈ చిత్రం దసరా పండుగను మరింత స్పెషల్ గా మార్చడం ఖాయం. చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే. ఆ చరిత్ర నాదే అని బాలయ్య చెప్పే డైలాగ్స్ థియేటర్లలో పేలడానికి సిద్ధంగా ఉండండి. బాలకృష్ణ అభిమానులు, మూవీ మేకర్స్ మరిన్ని అప్‌డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి! అలాగే కింద ఉన్న వీడియోలో బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ చూడండి.





.webp)

