Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఓన్లీ సింగిల్ ఫ్రమ్ ముంబై!.. మాఫియా నేపధ్యం పక్కానా!
posted on: Feb 7, 2026 10:24AM

-బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కథ ఏంటి!
-ముంబై నేపథ్యం ఫిక్స్ !
-మాఫియా డాన్ అయితే అభిమానులు ఏం చేస్తారో
సిల్వర్ స్క్రీన్ పై గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)చేసే సౌండ్ కి ఆల్ ఏరియా రికార్డ్స్ బాలయ్య కి దాసోహమవుతాయనే విషయం తెలిసిందే. ప్రీవియస్ మూవీ అఖండ 2 నే రీసెంట్ ఉదాహరణ. ఈ చిత్రానికి బాలయ్య కట్ అవుట్ కి తగ్గట్టుగా టాక్ రాకపోయినా కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య చరిష్మా ఏ పాటిదో మరోసారి రుజువయ్యింది. ప్రస్తుతం అభిమానుల దృష్టి మొత్తం గోపీచంద్ మలినేని(Gopichand Malineni)దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంపై ఉంది. వీరసింహ రెడ్డి కాంబో కావడంతో ఈ సారి ఎలాంటి కధా నేపథ్యంతో వస్తారనే ఆసక్తి కూడా నెలకొని ఉన్న క్రమంలో సోషల్ మీడియాలో సదరు చిత్రానికి సంబంధించి వస్తున్న న్యూస్ వాళ్ళల్లో సరికొత్త జోష్ ని తీసుకొస్తుంది. మరి సదరు న్యూస్ ఏంటో చూసేద్దాం.
NBK 111 గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కబోతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత రెగ్యులర్ కథ నే అని చెప్పారు.ఇప్పుడు ఆ కథ ముంబై నేపథ్యంలో జరిగే స్టైలిస్ట్ మాస్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. బాలకృష్ణ సింగల్ క్యారక్టర్ లోనే కనిపించబోతునట్టుగా కూడా చెప్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తు 'ముంబై నేపధ్యం అంటే మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందా! అదే జరిగితే బాలయ్య ని మాఫియా డాన్ గా చూడాలనే మా కోరిక ఈ సినిమా ద్వారా నెరవేరినట్టే, సిల్వర్ స్క్రీన్ వద్ద బాలయ్య ఊచకోత మరో లెవల్ లో ఉండబోతుందనే కామెంట్స్ చేస్తున్నారు.
also read: బాలీవుడ్ లో 90 శాతం పెళ్లిళ్లు ఫేక్.. పూర్తి డీటెయిల్స్ వివరించిన అగ్ర నటుడు
కథ ఏదైనా సరే అభిమానులకి ఈ సారి బాలయ్య నుంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందించాలని గోపిచంద్ మలినేని పట్టుదలతో ఉన్నాడు.సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ, తన కెరీర్ తో పాటు బాలయ్య కెరీర్ లోనే మర్చిపోలేని మూవీగా నిలబడిపోవాలని ఆశపడుతున్నాడు. బాలయ్య తో జోడీకట్టే భామతో పాటు మిగతా వివరాలు తెలియనున్నాయి. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా నందమూరి థమన్ మ్యూజిక్. మార్చి తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది.






