Nanna Kutty Movie Review Telugu: నాన్న కుట్టి మూవీ రివ్యూ
Nov 26, 2026 10:35AM

-సినిమా పేరు: నాన్న కుట్టి
-నటీనటులు: విజయ్ ఆంటోనీ, ప్రీతీ అస్రాణి, లితన్య,భగవతి పెరుమాళ్,హరి ప్రియా ఇసై, అరువి మదన్, లిజి ఆంథోనీ తదితరులు
-సినిమాటోగ్రఫీ:రాజీవ్ రాజేంద్రన్
-ఎడిటింగ్: విజయ్ ఆంథోనీ
-మ్యూజిక్: విజయ్ ఆంథోనీ
-నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంథోనీ
-బ్యానర్స్ :సర్వాంత్ రామ్ క్రియేషన్స్ , రామాంజనేయులు జవ్వాజి ప్రొడక్షన్స్, విజయ్ అంథోని ఫిలిం కార్పొరేషన్
-రచన,దర్శకత్వం: ఎం యు. మారన్
-రిలీజ్ డేట్ : నవంబర్ 27 , 2026
తెలుగు హీరో హోదాలోనే ట్రావెల్ అవుతున్న విజయ్ ఆంథోనీ 'నాన్న కుట్టి'తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. రిలీజ్ రేపు అయినా నిన్ననైట్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారంటే మేకర్స్ కి మూవీపై ఉన్న నమ్మకాన్ని అర్ధం చేసుకోవచ్చు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
సూర్య (విజయ్ ఆంటోనీ) సినిమా వాళ్ళు షూటింగ్ కోసం అవుట్ డోర్ వచ్చినప్పుడు లొకేషన్స్ ఎరేంజ్ చేసే మేనేజర్ గా వర్క్ చేస్తుంటాడు. భార్య లేదు. కూతురు దియా( లితన్య) సెకండ్ క్లాస్ చదువుతూ ఉంటుంది. దియా మెహందీ అడిగితే అందులో కెమికల్ ఉంటుందని గోరింటాకుని తెచ్చే రకం టైపు తండ్రి సూర్య. ఏదైనా విషయంలో దియాతో అబద్దం చెప్తే తను నమ్మి ఊరుకుంటుందేమో గాని, నా మనసు ఒప్పుకోదు కదా అనేంత బూమర్ తండ్రి కూడా. దియాకి కూడా తండ్రి సూర్య తన కోసం ఏమైనా చేస్తాడనే నమ్మకం. అనిత( ప్రీతీ అస్రాణి) దియా స్కూల్ టీచర్. ఎంతో సౌమ్యురాలు. సూర్యని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. దియా అంటే ఎంతో అభిమానం. కూతురుగా బావిస్తుంటుంది. అనితతో పెళ్లికి మాత్రం సూర్య ఒప్పుకోడు. ఈ క్రమంలో దియా ప్రాణాంతకర వ్యాధికి గురవుతుంది. ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే దియా తల్లి తండ్రులు ఇంకో బిడ్డని కనాల్సి వస్తుంది. లేదంటే దియా చనిపోతుంది. కానీ దియా తండ్రి సూర్య కాదు. కనీసం వాళ్ళు ఎవరో కూడా సూర్యకి తెలియదు. మరి దియా తల్లి తండ్రులు ఎవరు? సూర్య దగ్గర ఎందుకు ఉంది? దియాకి వచ్చిన ప్రాణాంతకర జబ్బు ఏంటి? అందుకు తల్లి తండ్రులు ఇంకో బిడ్డని ఎందుకు కనాలి? దియా ప్రాణాలు నిలబడ్డాయా? ఆ విషయంలో సూర్య చేసిన పోరాటం గెలిచిందా? అనేదే నాన్న కుట్టి.
ఎనాలసిస్
చాలా మంచి కథ. పాన్ ఇండియా లెవల్లో బడా హీరో భారీ బడ్జెట్ తో ఈ కథని తెరకెక్కిస్తే వద్దన్నా వంద రోజులు ఆడుతుంది. సినిమా చూస్తున్నంత సేపు చాలా మంది బడా హీరోల పేర్లు యాదికొస్తూనే ఉంటాయి. అదే విధంగా ఈ లోకంలో ఇంకా మంచి మనుషులు ఉండబట్టే ఈ భూమి ఇంకా పచ్చగా ఉందనే విషయం స్ఫురణకి వస్తు ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సూర్య ఇంట్రడక్షన్ సీన్ తో నాన్నకుట్టిలోకి లీనమైపోతాం. తండ్రి,కూతురు మధ్య అనుబంధానికి సంబంధించిన సీన్స్ చాలా సినిమాల్లో చూసేసాం. కానీ ప్రకృతి అందాలకి నెలవైన 'ఊటీ'లో తెరకెక్కించడం వల్ల కొత్తగా కనిపించాయి. స్కూల్ టీచర్ అనిత, దియా, సూర్య మధ్య వచ్చిన సీన్స్ అన్ని సూపర్.
కాకపోతే దియా ఒరిజినల్ తల్లితండ్రులు వేరు వేరే పెళ్లిళ్లు చేసుకొని ఉన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ లోనే వాళ్ల లైఫ్ కి సంబంధించిన సీన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుండాలసింది. దాని వల్ల ఫస్ట్ హాఫ్ లో దియా, సూర్య, అనిత మధ్యనే సీన్స్ కాకుండా కొంచం ఫ్రెష్ నెస్ వచ్చేవి. ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లౌయింగ్. సెకండ్ హాఫ్ లో కథ ఎక్కడా కూడా ఆగకుండా చాలా వేగంగా ట్రావెల్ అయ్యింది.
దీంతో ఏ సీన్ కి ఆ సీన్ క్యూరియాసిటీ కలిగించడంతో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఇంట్రెస్ట్ కలిగింది. దియా కోసం సూర్య పోరాటం, సూర్యకి అండగా అనిత ఉన్న ఎపిసోడ్స్, కోర్టు ఎపిసోడ్స్ తో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎక్స్ టార్డినరీ
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
సూర్యగా పలు విభిన్న షేడ్స్ తో కూడిన పెర్ఫార్మ్ ప్రదర్శించడంలో విజయ్ మరోసారి సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో హుషారుగా యాటిట్యూడ్ ని ప్రదర్శించాల్సింది. అనితగా చేసిన ప్రీతీ అస్రాణి టోటల్ మూవీకే అందంగా నిలవడంతో పాటు, ఇంకా ఇలాంటి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారా అనిపించేలా మెస్మరైజ్ చేసింది.పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తే టాప్ హీరోయిన్ కుర్చీలో కూర్చోవడం ఖాయం. దియాగా చేసిన లితన్య పెర్ఫార్మ్ ఆకట్టుకునేలా సాగింది. క్లైమాక్స్ లో కన్నీళ్లు కూడా తెప్పించింది. మిగతా ఆల్ ఆర్టిస్ట్స్ కూడా నాన్న కుట్టి ప్రేక్షకులకి నచ్చేలా చెయ్యడం కోసమే నటనా రంగంలోకి అడుగుపెట్టామని అన్నట్టుగా ఆకట్టుకున్నారు. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు అన్ని సూపర్. మారన్ రచయితగా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ప్రతి షాట్ ని అద్భుతంగా మలిచాడు
బలాలు
1.కథ, కధనం
2. ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్
3 .డైరెక్షన్
చివరిగా చెప్పాలంటే మహారాష్ట్రలోని 'పూణే'లో జరిగిన నిజ జీవిత సంఘటనలకి కొన్ని కల్పితాలు జోడించి చెప్పి హృదయాల్ని కొల్లగొట్టారు.
రేటింగ్ 2 .75/ 5
అరుణాచలం



