Home

»

Latest News

చెఫ్‌గా నాని.. గ్యాంగ్‌స్టర్‌గా మరో షేడ్.. ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ అప్‌డేట్ ఇదే.!

Oct 12, 2026 6:55PM

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాపై ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 17 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అనంతరం లండన్, హైదరాబాద్‌లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్‌కు సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

‘బ్లడీ రోమియో’లో నాని పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బయటకు చెఫ్‌గా కనిపిస్తూ మరోవైపు హింసాత్మక గ్యాంగ్‌స్టర్‌గా ఉండే విభిన్నమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. డార్క్ హ్యూమర్, స్టైలిష్ యాక్షన్ అంశాలతో దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’లో రగ్డ్ లుక్‌లో కనిపించిన నాని, ఈ సినిమా కోసం రెట్రో స్టైల్‌లోకి మారడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

నాని కొత్త లుక్‌లో ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్, బ్లాక్ గాగుల్స్‌తో కనిపిస్తుండటం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ఆయన సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

నాని, సుజీత్ తొలిసారి కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. నాని నటనకు సుజీత్ స్టైలిష్ మేకింగ్, యాక్షన్‌తో పాటు డార్క్ హ్యూమర్ తోడైతే ‘బ్లడీ రోమియో’ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

[Nani Bloody Romeo, Bloody Romeo Shooting Date, Nani Sujeeth Movie, Bloody Romeo Delhi Schedule, Nani New Movie, Sujeeth Upcoming Movie, Preethi Mukundhan, Prithviraj Sukumaran, Nani Retro Look, Telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com