TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

నాగచైతన్యలో ఈ మార్పు గమనించారా: చిన్నచిన్న విషయాలకే ఎందుకు కృంగిపోవాలి: ఏం చెప్పావు భయ్యా!

Nov 28, 2026 10:48AM


ఫ్యాన్స్ అండ్ డియర్ ఆడియెన్స్ డోంట్ వర్రీ.. ఈ సారి కూడా డిఫరెంట్ సబ్జెక్టు వృష కర్మ తో మీకు అసలైన సినీ విందు, మజాని డిసెంబర్ 4 న ఇవ్వడానికి వస్తున్నాను అంటున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. హిట్టు కూడా పక్కా అంటూ ప్రమోషన్స్ ని కూడా చాలా కాన్ఫిడెన్స్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రమోషన్స్ లో చేసిన వ్యాఖ్యలు చైతన్య అందమైన మనసుని అద్దంలో చూసేలా చేస్తున్నాయి. మరి ఆ అందమైన మనసుని చూసేద్దాం.


సినిమాలు కొందరికి వినోదాన్ని ఇస్తే.. మరికొందరికి జీవితంపై కొత్త ఆలోచనలను కలిగిస్తాయి. ముఖ్యంగా కొన్ని క్యారెక్టర్స్, కొన్ని అనుభవాలు నటీనటుల జీవితాలపై కూడా ప్రభావం చూపిస్తుంటాయి. అలాంటి అనుభవమే తనకు తండేల్ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైందని యువసామ్రాట్ నాగచైతన్య వెల్లడించారు. నగరాల్లో ఉంటూ చిన్నచిన్న సమస్యలకే బాధపడే మనం.. నిజంగా ఎంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నామో మత్స్యకారుల జీవితాలని  దగ్గరగా చూసిన తర్వాత అర్థమైందని చెప్పుకొచ్చాడు.

తండేల్ మూవీ మార్చిన ఆలోచనా విధానం!

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్. ఈ సినిమాలో చైతన్య ఒక మత్స్యకారుడి పాత్రలో కనిపించారు. ఈ పాత్ర కోసం ఆయన శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మత్స్యకారులతో సమయం గడిపాడు . వారి జీవనశైలి, సముద్రంలో ఎదురయ్యే పరిస్థితులు, కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు పడే కష్టాలను దగ్గరగా తెలుసుకున్నాడు.

 

సినిమా షూటింగ్ సమయంలో మత్స్యకారుల జీవితాలను పరిశీలించినప్పుడు వారి కష్టాలు తనను ఎంతో కదిలించాయని నాగచైతన్య తెలిపారు. సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. అయినప్పటికీ కుటుంబం కోసం, జీవనోపాధి కోసం వారు ప్రతిరోజూ సముద్రంలోకి వెళ్లాల్సిందే. బతికినా, చనిపోయినా సముద్రమే వారి జీవితమనే పరిస్థితులు ఉంటాయని వివరించారు.

ఇది కూడా చదవండి: గెటప్ మార్చినంత మాత్రాన ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా?

చిన్న సమస్యలకే ఎందుకు అంత బాధపడుతున్నాం?

నగరాల్లో నివసించే మనం రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలకే ఎంతో బాధపడుతుంటాం. కానీ మత్స్యకారుల జీవితాల్లోని అసలైన పోరాటాన్ని చూసిన తర్వాత మనం ఎంత అదృష్టవంతులమో అర్థమైందని చైతన్య అభిప్రాయపడ్డారు. వారి కష్టాలు, అనిశ్చితుల మధ్య కూడా వారు చూపించే ధైర్యం, కుటుంబాలపై ప్రేమ తనకు ఎన్నో విషయాలు నేర్పాయని చెప్పారు.

ఒక సినిమా కోసం చేసిన ప్రయాణం తన ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చిందని ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. తెరపై ఒక పాత్రను పోషించడం మాత్రమే కాకుండా, ఆ పాత్ర వెనుక ఉన్న నిజమైన మనుషుల జీవితాలను తెలుసుకోవడం కూడా నటుడిగా తనకు గొప్ప అనుభవమని చెప్పొచ్చు.

తన సైలెంట్ నేచర్‌పైనా చైతూ కామెంట్స్!

ఇదే సందర్భంగా తన వ్యక్తిత్వం గురించి కూడా నాగచైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను ఇంట్రోవర్ట్ అని, తన గురించి వచ్చే రూమర్స్ చూసినప్పుడు కూడా ఎక్కువగా స్పందించకుండా సైలెంట్‌గా ఉండిపోతానని తెలిపారు. అయితే తన మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు.

 ఇక కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన వృషకర్మ డిసెంబర్ 4న రానుంది. గోల్డెన్ లెగ్ భామ మీనాక్షి చౌదరి హీరోయిన్.ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ట్రావెల్ వ్లాగర్ జాస్తితో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ తన జీవితానుభవాలని  పంచుకున్నాడు.

మొత్తానికి తండేల్ సినిమా నాగచైతన్యకు కేవలం నటుడిగా కొత్త అనుభవాన్ని మాత్రమే కాదు.. జీవితాన్ని చూసే విధానంలోనూ ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసినట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనే మత్స్యకారుల పోరాటం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అందుకే అంటారు సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు. నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడానికి నీ ముందున్న అతి పెద్ద పాఠ్య గ్రంధం.

 

మీకు నచ్చవచ్చు 

భోగి ఫస్ట్ డే కలెక్షన్స్

వెంకటేష్ అభిమానులకి  తీపి కబురు: మీ అభిమాన మూవీ రీ రిలీజ్!

 

 

 

[Naga Chaitanya, Vrushakarma, meenakshi chowdary, Karthik Dandu]

 


 

google-ad-img