Home

»

Latest News

Lenin: లెనిన్ మూవీ విలన్ ఎలివేషన్.. ఆ క్యారక్టర్ పై నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ వార్నింగ్ 

Jul 13, 2026 2:16PM


నవ యువసామ్రాట్ 'అక్కినేని అఖిల్' లెనిన్(Lenin)తో తన సత్తా చాటుతూ సరికొత్త రికార్డులు సృష్టించే పనిలో ఉన్నాడు. మూవీ చూసిన ప్రతి ఒక్కరు లెనిన్ గా అఖిల్ పెర్ఫార్మ్ అదుర్స్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే టైంలో వసంత్ క్యారక్టర్ పోషించిన ప్రమోద్ పంజు పెర్ఫార్మ్ కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.  ఈ క్యారక్టర్ పై ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ కి ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇచ్చిన రెస్పాన్స్ వైరల్ గా మారింది.  

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన 'కల్కి 2898 AD' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికీ సోషల్ మీడియాలో దీనిపై చర్చలు, వివాదాలు పూర్తిగా చల్లారలేదు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్ పోషించిన 'కర్ణుడి' క్యారక్టర్  చూపించిన విధానంపై కొంతమంది నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు  'లెనిన్' విడుదల తర్వాత ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. లెనిన్ లో కర్ణుడి తరహా క్యారక్టర్ లో చేసిన   ప్రమోద్ పంజు నటనని  ప్రశంసిస్తూ కల్కి లో  నాగ్ అశ్విన్ కర్ణుడి రోల్ ని  విపరీతంగా కీర్తించారని, పురాణాల్లోని అతడి తప్పులను పక్కనబెట్టి కేవలం గొప్పతనాన్ని మాత్రమే హైలైట్ చేశారు. సినిమా క్లైమాక్స్ ఏకంగా ఒక తరానికే తప్పుడు సందేశాన్ని ఇచ్చేలా ఉంది. ఇది ఒక రకమైన దైవదూషణ అంటూ ట్వీట్ చేసాడు.


also read: Lenin: లెనిన్ మూడు రోజుల కలెక్షన్స్ ఇవే.. రికార్డులే తరువాయి


 ప్రముఖ రచయిత బిబేక్ దేబ్రాయ్ ఆంగ్లంలోకి అనువదించిన మహాభారత గ్రంథంలోని ఒక పేజీని స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగ్ అశ్విన్'  "దయచేసి మహాభారతాన్ని పూర్తిగా చదవండి. వీలైతే బిబేక్ దేబ్రాయ్ వెర్షన్ చదవాలని నేను సూచిస్తున్నాను. మహాభారతంలోని 'ద్రోణ వధ పర్వం'లో అర్జునుడితో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పలికిన మాటలు అర్థమవుతాయి. అది కూడా కుదరకపోతే, యుద్ధరంగంలో అర్జునుడి ముందే శ్రీకృష్ణుడు కర్ణుడిని ఎన్నిసార్లు, ఎంతలా ప్రశంసించాడో ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి.

భారతీయ ఇతిహాసాలు, మన సంస్కృతిపై అపారమైన గౌరవం ఉంది. పురాణాలను, చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పూర్తి అవగాహనతోనే తాను ఈ సినిమాను రూపకల్పన చేశానని పేర్కొన్నారు. "నేను ఏం చేస్తున్నానో నాకు పూర్తిగా తెలుసు. కథపై నాకు స్పష్టమైన క్లారిటీ ఉంది. కాబట్టి అనవసరమైన ముగింపులకు రాకండి, అసలు కథ తెలియాలంటే 'కల్కి పార్ట్ 2' కోసం వేచి ఉండండి" అంటూ ఆయన పెట్టిన సింగిల్ లైన్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఒక్క సమాధానంతో అటు విమర్శకుల అంచనాలకు బ్రేక్ వేయడమే కాకుండా, సీక్వెల్‌పై ఉన్న హైప్‌ను మరింతగా పెంచేశారు.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com