Home

»

Latest News

Akhil: అఖిల్ ప్లాన్ ఇదేనా!  ఆ హీరోలతో మల్టీస్టారర్ మూవీ!

Jul 13, 2026 2:41PM

 


అఖిల్ అక్కినేని(Akhil Akkineni)సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కమర్షియల్ సక్సెస్‌ని  ఇటీవల విడుదలైన పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’(Lenin)రూపంలో అందుకోవడంతో అటు అభిమానుల్లో, సినీ వర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ పవర్‌ఫుల్ విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద కేవలం మూడు రోజుల్లోనే 61 .1 కోట్ల  భారీ గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ సక్సెస్‌తో అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. ఈ భారీ సక్సెస్ అందించిన ఊపుతో అక్కినేని హీరోలంతా కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించేందుకు ఒక సంచలన మల్టీస్టారర్ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

అక్కినేని మూడు తరాల హీరోలు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన క్లాసిక్ చిత్రం 'మనం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాదాపు అదే తరహాలో అంతకంటే భారీ స్థాయిలో సరికొత్త కథతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో ఒక ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో కింగ్ నాగార్జున, యువ నటులు నాగచైతన్య, అఖిల్ ముగ్గురూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది.

Also read: Lenin: లెనిన్ మూవీ విలన్ ఎలివేషన్.. ఆ క్యారక్టర్ పై నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ వార్నింగ్ 


ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌తో అఖిల్ మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇకపై తన చిత్రాల మధ్య సుదీర్ఘ విరామం ఉండబోదని, చాలా వేగంగా కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అఖిల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే, తన సోలో ప్రాజెక్టులతో పాటు ఈ అక్కినేని మల్టీస్టారర్ స్క్రిప్ట్ పనులను కూడా వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున స్వయంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ లైన్‌  ఓకే చేశారని, ముగ్గురు హీరోల క్యారెక్టర్స్ పవర్‌ఫుల్‌గా ఉండేలా ఒక స్టార్ డైరెక్టర్ ఈ కథను సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.  

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com