చెర్రీ, బన్నీకి మైనస్.. మరి వరుణ్ సంగతేంటో?
on May 12, 2020
తెలుగునాట కథానాయికగా స్టార్డమ్ చూడలేకపోయిన నదియా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం ఆ లోటును తీర్చేసుకుంది. ప్రభాస్ ‘మిర్చి’తో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నదియాకి పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’తో ఎనలేని గుర్తింపు వచ్చింది. అటుపై పలు భారీ చిత్రాల్లోనూ సందడి చేసింది. ఒక దశలో నదియా ఉంటే.. సినిమా హిట్ అనే సెంటిమెంట్ బలపడింది కూడా. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘దృశ్యం’.. ఇలా స్టార్ హీరోల సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హ్యాట్రిక్ అందుకున్న నదియా.. అటుపై అగ్ర కథానాయకుల చిత్రాల్లో మెరిసినా ఎందుకనో విజయాలైతే దక్కలేదు.
మరీ ముఖ్యంగా.. తనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన మెగా కాంపౌండ్ హీరో పవన్ కళ్యాణ్ తాలూకు కుటుంబ కథానాయకులైన రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలతో నదియాకి చుక్కెదురైంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం నదియా నటించిన ‘బ్రూస్లీ’లో చరణ్ హీరోగా నటించగా.. ‘అ ఆ’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత వచ్చిన ‘నా పేరు సూర్య’లో బన్నీ హీరోగా నటించాడు. అయితే, ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ నేపథ్యంలో.. స్వల్ప విరామం తరువాత మరో మెగా కాంపౌండ్ హీరో సినిమాలో నటిస్తోంది నదియా. ఆ హీరో మరెవరో కాదు.. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ పేరు నిర్ణయించని చిత్రంలో వరుణ్‌కి తల్లిగా దర్శనమివ్వనుంది నదియా.
మరి.. పవన్ కళ్యాణ్ తరువాత మెగా కాంపౌండ్‌లో నదియా నటించిన సినిమాలేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో.. వరుణ్ చిత్రమైనా వర్కవుట్ అవుతుందేమో చూడాలి. అలాగే చెర్రీ, బన్నీకి మైనస్ అయిన నదియా.. పవన్ తరహాలో వరుణ్‌కి ప్లస్ అవుతుందో లేదో అన్నది కూడా ఆసక్తికరమే.