లొకేషన్ ముంబై నుంచి హైదరాబాద్‌కు మారిందా?
on May 12, 2020

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు చంకీ పాండే కూతురు అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని ఛార్మి ఆధ్వర్యంలోని పూరి కనెక్ట్స్ బ్యానర్‌తో పాటు కరణ్ జోహార్ బ్యానర్ ధర్మా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతున్న ఈ మూవీ తొలి షెడ్యూల్‌ను ముంబైలో నిర్వహించారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో షెడ్యూల్ పూర్తికాకుండానే విజయ్, పూరి, హైదరాబాద్‌కు చెందిన యూనిట్ మెంబర్స్ అంతా ఇక్కడకు వచ్చేశారు.
ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కొంత కాలం పాటు అక్కడ షూటింగ్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో హైదరాబాద్‌లోనే షూటింగ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ముంబైలో ఇప్పటివరకు తీసిన సన్నివేశాలకు తగ్గ బ్యాగ్రౌండ్ సెట్‌ను హైదరాబాద్‌లోనే వేసి, అందులో మిగిలిన సీన్లను తీస్తే ఎలా ఉంటుందని డైరెక్టర్ పూరి ఆలోచిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ ఒక మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించనున్నాడు. దీని కోసం అతను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు కూడా. ఈ సినిమా కోసం ఫిల్మ్‌చాంబర్‌లో 'లైగర్' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేశారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ మూవీని తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



