
సినిమా పేరు: మెన్షన్ హౌస్ మల్లేష్
నటీనటులు: శ్రీనాధ్ మాగంటి, గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్, సాయి ప్రసన్న తదితరులు
సినిమాటోగ్రఫీ: అమ్మముత్తు. కే
ఎడిటింగ్: గారీ బి హెచ్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
నిర్మాత:రాజేష్ కుమార్
రిలీజ్ :మైత్రి మూవీ మేకర్స్
బ్యానర్: కనకమేడల ప్రొడక్షన్స్
రచన,దర్శకత్వం: బాల సతీష్
రిలీజ్ డేట్ : మార్చి 6 , 2026
సెల్యులాయిడ్ పై ఈ రోజు విభిన్నమైన టైటిల్ తో తెరకెక్కిన 'మెన్షన్ హౌస్ మల్లేష్' ప్రత్యక్షమయ్యింది. ప్రచార చిత్రాలతో క్రేజ్ ఏర్పడటం, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ రిలీజ్ చేయడంతో మూవీ లవర్స్, ప్రేక్షకుల కళ్ళు మెన్షన్ హౌస్ పై పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
తెలంగాణలోని యాదగిరి గుట్ట పరిసర ప్రాంతానికి చెందిన మల్లేష్( శ్రీనాధ్) చిన్నప్పట్నుంచి ఆల్కహాల్ తాగుతూ పెరిగి పెద్దవుతాడు. ఉదయాన్నే పరగడుపున మందు తాగందే బ్రెష్ కూడా చేయని స్వభావం. అలా అని చెడ్డవాడేం కాదు. మంచోడే. కానీ ఆవేశపరుడు. తన ఊరి పటేల్(రాజేష్ ) కి మల్లేష్ కి గొడవ. ఒకరంటే ఒకరికి అసలు పడదు. మల్లేష్ కి జ్యోతి (గాయత్రి రమణ) తో పెళ్లి జరుగుతుంది. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ ఆ ఇద్దరి మధ్య 'కార్యం' మాత్రం జరగదు. ఆ ఇద్దరి మధ్య 'కార్యం' జరగకపోవడానికి కారణం ఏంటి? చివరకి జరిగిందా లేదా! మల్లేష్,పటేల్ కి మధ్య గొడవ ఎందుకు? పటేల్ భార్య పద్మ ( కామాక్షి భాస్కర్ల) పోషించిన క్యారక్టర్ ఏంటి? వంటి పలు ప్రశ్నల సమూహారమే మెన్షన్ హౌస్ మల్లేష్
ఎనాలసిస్
ఎలాంటి హడావిడి, గందరగోళం లేకుండా సిల్వర్ స్క్రీన్ పై మరోసారి తెలంగాణ పల్లె వాతావరణం, మాండలికం మెరిసింది. సింపుల్ కథ అయినా పకడ్బందీ స్క్రీన్ ప్లే తో బాగానే నడిపించారు. నడిపించారు అని ఎందుకు అంటున్నామంటే, కథనం విషయంలో ముందు కెళ్ళి, మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. కానీ చూస్తున్నంత సేపు ఎంటర్ టైన్ మెంట్ పక్కా. . ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మొదటి పావుగంట రొటీన్ గానే ఉంటుంది. సీన్స్ కూడా చాలా సినిమాల్లో వచ్చినవే. కానీ ఆ తర్వాత వచ్చిన సీన్స్ తో కథలో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది.
మల్లేష్, జ్యోతి పెళ్లి చూపుల సీన్ తో పాటు జ్యోతి క్యారక్టర్ తో వచ్చిన సీన్స్ అన్ని బాగున్నాయి. పటేల్, మల్లేష్ గొడవల సీన్ రొటీన్. మల్లేష్ అతని తల్లి మధ్య వచ్చిన సీన్స్ మెప్పిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో మల్లేష్, జ్యోతి కలవడానికి స్నేహితులు చేసే ప్రయత్నాలు బాగున్నాయి. కానీ ఈ విషయంలో మరింత డీప్ గా వెళ్ళాలి. కానీ వెళ్ళలేదు. మల్లేష్ తల్లిని చంపడం కథని సాగ తియ్యడానికే చేసినట్టుగా ఉంది. మల్లేష్ తండ్రి రెండు ఫ్లాష్ బ్యాక్ లు నవ్వులు పూయిస్తాయి. మల్లేష్, జ్యోతి బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు పక్కింట్లోని ఓల్డ్ మాన్ ఓల్డ్ సాంగ్స్ ని వింటుండే ఎపిసోడ్ బాగా పేలింది. పోలీస్ స్టేషన్ లోని పద్మ సీన్ కూడా అంతే. ఒక లెవల్ అని చెప్పవచ్చు.
ఇక్కడ నుంచి సినిమా చివర దాకా ఆమె క్యారక్టర్ ని అదే టెంపోతో హైలెట్ గా చేసి, మల్లేష్, జ్యోతి కార్యానికి కావాల్సిన చిట్కాలని, తాను చేయడంతో పాటు తన భర్త పటేల్ తో చేసి ఉంటే సినిమా హిట్ స్థాయి పెరిగేది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నా మల్లేష్, జ్యోతి మధ్య ఇన్నాళ్లు కార్యం కాకపోవడానికి చివరలో కార్యం అవ్వడానికి గల బలమైన కారణాన్ని చెప్పాల్సింది.
నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు
మల్లేష్ గా శ్రీనాధ్ పెర్ఫార్మ్ పెద్ద హీరో స్థాయిలో చాలా మెచ్యూర్డ్ గా ఉంది. మంచి అవకాశాలు వస్తే తెలుగు చిత్రసీమలో తనదైన హవాని కొనసాగించడం పక్కా. హీరోయిన్ గా చేసిన గాయత్రి రమణ కూడా మనకి తెలిసిన పక్కింటి అమ్మాయిలా తన క్యారక్టర్ పరిధి మేరకు చాలా ఈజీగా చేసింది. కామాక్షి భాస్కర్ల కి ఎక్కువ స్కోప్ లేకపోయినా, కనపడినంత సేపు అద్భుతమైన పెర్ ఫార్మ్ ప్రదర్శించి సినిమాకి నిండుతనాన్ని తెచ్చింది. మురళిధర్ గౌడ్ మరోసారి తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి పెర్ఫార్మ్ బాగున్నా రొటీన్ యాక్షన్ లాగా ఉంది. పటేల్ గా చేసిన రాజేష్ ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలతో బిజీ అవ్వడం ఖాయం. అంతలా సెటిల్డ్ పెర్ఫార్మ్ ప్రదర్శించాడు. మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన వారు కూడా పర్లేదు. బాల సతీష్ దర్శకుడిగా సక్సెస్ అయినా, రచయితగా మాత్రం తడడ్డాడు. కథ టెంపోకి తగట్టుగా సీన్స్ రాలేదు. సురేష్ బొబ్బిలి తన బ్యాక్ గ్రౌడ్ స్కోర్, సాంగ్స్ తో సరికొత్త జీవాన్ని పోసాడు. ఫొటోగ్రఫీ సూపర్ గా ఉంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం వల్ల నిర్మాణ విలువల్లో భారీ తనం లేకపోయినా బాగున్నాయని అనిపిస్తాయి.
టోటల్ గా మెన్షన్ హౌస్ మల్లేష్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నటీనటుల పెర్ ఫార్మెన్స్, డైరెక్షన్ బాగుంది. కథ, కథనం సో సో..
బలాలు
1 .మల్లేష్, జ్యోతి క్యారెక్టర్స్ డిజైన్
2 . పటేల్, మల్లేష్ మధ్య వచ్చిన సీన్స్
3 .బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్
4 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
బలహీనతలు
1 .కథనంలో పట్టు లేకపోవడం
2 .ఫస్ట్ హాఫ్
3 . ఎంటర్ టైన్మెంట్
4 .సాగతీత సీన్స్
రేటింగ్ 2 .5 /5
అరుణాచలం






