Home

»

Latest News

సినీ, రాజకీయ రంగాల్లోని విశిష్ట మహిళలకు ‘విశ్వమహిళా బాపు బొమ్మ పురస్కారాలు’

Mar 06, 2026

తెలుగు సాహిత్యం, సినిమా రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖులు బాపు, రమణ స్మారకంగా నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, సాంస్కృతిక ప్రముఖులు హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమం మార్చి 8, 2026న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న హోటల్ దస్పల్లాలో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దివ్య వెలుగు క్రియేషన్స్ దివ్యవాణి చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 

ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సాహిత్యం, సినిమా రంగాలకు సంబంధించిన ప్రముఖులు పాల్గొని బాపు, రమణల సృజనాత్మక వారసత్వాన్ని స్మరించనున్నారు. వారి కళా సేవలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. వారిలో నటుడు రాజేంద్ర ప్రసాద్, దిల్ రాజు, బ్రహ్మానందం, శ్రీకాంత్, ఆది సాయికుమార్, సాయిధరమ్ తేజ్, నరేష్, రఘుబాబు, హర్షవర్ధన్ తదితరులు పాల్గొననున్నారు. 

ఈ కార్యక్రమంలో విశ్వమహిళా బాపు బొమ్మ పురస్కారాలు అందజేయనున్నారు. అందులో భాగంగా మెగా విశ్వమహిళ బాపు బొమ్మ 2026 పురస్కారం మెగాస్టార్ చిరంజీవి మాతమూర్తి శ్రీమతి కొణిదెల అంజనీదేవికి అందజేయనున్నారు. విశ్వ మహిళ బాపు బొమ్మ 2026 పురస్కారం అందుకుంటున్న వారిలో టీవీ యాంకర్లు నాగ భార్గవి, స్వప్న, కష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, సీనియర్ నటి విజయశాంతి, బీజేపీ లీడర్ మాధవీలత, డాక్టర్ జి.వి.వెన్నెల, సింగర్ సమీరా భరద్వాజ, ఫ్యాషన్ డిజైనర్ రేఖారాణి, శ్రీమతి మట్టాడి ఆశాలత, మందుల మంగమ్మ తదితరులు ఉన్నారు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com