
-ఎగిరే చిలకమ్మ గా పవన్ ఫ్యాన్స్ లో ప్రత్యేక గుర్తింపు
-నిన్న కార్ బుక్ చేసుకుంది
-ఆ తర్వాతనే అసలు విషయం తెలిసింది
-ఆలా చెయ్యడం తప్పు కదా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో ఒక్క సినిమా చేసినా చాలు సదరు హీరోయిన్ ఛాయలు అంత త్వరగా తెలుగు ప్రేక్షకుల ఆలోచనల నుంచి వెళ్లవు. మరి స్వయంగా పవన్ కళ్యాణ్ నే ఆ హీరోయిన్ ని ఉద్దేశించి 'ఎగిరే చిలకమ్మా నా ముద్దుల మొలకమ్మ' అని అంటూ పాడితే, ఇక ఆ హీరోయిన్ ని మరవడం కొంచం కష్టమే కదా! అలాంటి ఒక హీరోయిన్ మీరాచోప్రా.. బంగారం(Bangaram)సినిమాలో పవన్ తో కలిసి చేసింది.
నిన్న ఉదయం మీరాచోప్రా(Meerra Chopra)బయటకి వెళ్ళడానికి ఉబర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంది. ఆరు గంటల పాటు తనతో ఉండాలనేది డీల్. కాసేపటికి కారు వచ్చింది. కానీ కారు నిండా దుమ్ము.డ్రైవర్ కూడా డర్టీ గా ఉన్నాడు.కారు ఎందుకు దుమ్ముగా ఉందని అడిగితే స మాధానం లేదు. కారు నడుతూనే నిద్రపోతున్నాడు. దాంతో ఆమె ఇరవై నిమిషాల్లోనే కారు దిగి వేరే క్యాబ్ బుక్ చేసుకుంది. కానీ ఆరు గంటల సమయానికి ఛార్జి వసూలు చేసాడు. జరిగిన ఈ విషయం మొత్తాన్ని సోషల్ మీడియా ద్వారా మీరా చోప్రా నే వెల్లడి చేసింది. కస్టమర్స్ భద్రతని గాలికొదిలేసి డబ్బు సంపాదించడం మాత్రమే వారి పని అని తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది.
Also read :Varanasi:వారణాసి కోసం ఎదురుచూస్తున్నారా! ఐతే ది బ్లఫ్ మూవీ చూడండి
మీరాచోప్రా బంగారం తో పాటు వాన, గ్రీకు వీరుడు వంటి చిత్రాల్లో చేసింది.బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లోను చేసింది. కానీ స్టార్ డమ్ విషయంలో పెద్దగా క్లిక్ అవ్వలేదు.
.webp)







