Home

»

Latest News

Prema Kavali: 15 ఏళ్ళ ప్రేమ కావాలి.. ఇలాంటి డ్రీమ్ డెబ్యూకి అదృష్టం ఉండాలి!

Feb 25, 2026

  • హీరోగా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆది సాయికుమార్
  • 'ప్రేమ కావాలి'తో డ్రీమ్ డెబ్యూ
  • దర్శకుడు విజయ భాస్కర్ కీ స్పెషల్ మూవీ

ఒక మంచి హిట్ ఫిల్మ్ తో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చాలామంది కలలు కంటుంటారు. అలాంటి డ్రీమ్ డెబ్యూ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ కి లభించింది. అదే 'ప్రేమ కావాలి'. ఈ సినిమా విడుదలై నేటితో 15 వసంతాలు పూర్తయింది. (Prema Kavali)

ఆది, ఇషా చావ్లా జంటగా ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ రూపొందించిన చిత్రం 'ప్రేమ కావాలి'. ఆదితో పాటు ఇషా చావ్లాకు కూడా ఇది తొలి చిత్రం కావడం విశేషం. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్.. 2011 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ప్రేమ కథకు టెర్రరిస్ట్ నేపథ్యాన్ని జోడిస్తూ 'ప్రేమ కావాలి' సినిమాని మలిచిన తీరు ఆకట్టుకుంది. లవ్ సీన్స్, కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పలు సెంటర్లలో వంద రోజులు ఆడిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.14 కోట్ల షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది.

'ప్రేమ కావాలి' విజయంలో అనూప్ రూబెన్స్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. 'చిరునవ్వే విసిరావే', 'మనసంతా ముక్కలు చేసి', 'నువ్వే నువ్వే' వంటి పాటలు ఆ సమయంలో మారుమోగిపోయాయి.

తొలి సినిమా అయినా తనదైన నటన, డ్యాన్స్ లతో ఆది మెప్పించాడు. బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డులు అందుకున్నాడు. 

దర్శకుడు విజయ భాస్కర్ కి కూడా ఇది స్పెషల్ ఫిల్మ్. దర్శకుడిగా నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన విజయ భాస్కర్.. ఏడేళ్ళ తరువాత అందుకున్న విజయమిది.

Also Read: చికిరి vs ఆయా షేర్.. ప్యారడైజ్ సౌండ్ మామూలుగా లేదు!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com