.webp)
కోలీవుడ్ యాక్టర్ సూరితో కలిసి టాలీవుడ్ యాక్టర్ సుహాస్ నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'మండాడి' థియేటర్లలోకి వచ్చేసింది. మహిమా నంబియార్, సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్ లాంటి సాలిడ్ కాస్టింగ్ ఈ సినిమాలో ఉంది. మతిమారన్ పుగళేంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. సముద్రం, బోట్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ట్విట్టర్‌లో ఆడియన్స్ పంచుకుంటున్న అభిప్రాయాల ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్‌లో ఉందట. ముఖ్యంగా సూరి, సుహాస్ మధ్య వచ్చే ఫేస్-టు-ఫేస్ సీన్స్, సీరియస్ మోడ్ కాన్‌ఫ్లిక్ట్స్ థియేటర్లో విపరీతమైన హై ఇస్తున్నాయని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు నటులు ఒకరినొకరు డామినేట్ చేసుకునేంత సీరియస్‌గా యాక్ట్ చేశారని, సీన్స్ బాగా పండాయని చెబుతున్నారు. ఇక ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిందని, అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు.

కోలీవుడ్ నేటివిటీ సముద్రపు రేసింగ్‌లో టాలీవుడ్ యాక్టర్ సుహాస్ ఒదిగిపోయిన తీరు అదిరిపోయింది అంటున్నారు. జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా కుదిరాయని టాక్ వస్తోంది. అయితే, ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కథనం కాస్త స్లో అయినప్పటికీ, ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పించిందని చెబుతున్నారు.
మొత్తానికి సూరి, సుహాస్‌ల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, సముద్రం నేపథ్యంలో సాగే డిఫరెంట్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్, అదిరిపోయే ప్రీ-ఇంటర్వెల్ ఫైట్ అండ్ యాక్షన్ సీన్స్ కోసం 'మండాడి' సినిమాను తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
[Mandaadi Twitter Review, Mandaadi Movie Review, Mandaadi Review Telugu, Suhas, Soori, Telugu Movie Review, Telugu Cinema Review]




