
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న మూవీ 'వడ్డీ కాసులవాడ'. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు రవి మోహన్ (జయం రవి) 'శ్రీ వెంకటేశ్వర స్వామి' పాత్రలో కనిపించబోతున్నారు. భక్తుడిగా మనోజ్ కనిపించనున్నారు. దేవుడికి, భక్తుడికి మధ్య జరిగే ఆసక్తికర కథతో ఇది తెరకెక్కుతోంది.
నేడు(సెప్టెంబర్ 10) జయం రవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన బర్త్‌డే విశెస్ స్పెషల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్ లో గుడిని చూపిస్తూ.. భక్తుడికి అండగా ఉండటం కోసం, అతని చేతిని వెంకటేశ్వర స్వామి పట్టుకున్నట్టుగా డిజైన్ చేసిన పోస్టర్ అకట్టుకుంటోంది.

ఇప్పటికే విడుదలైన 'వడ్డీ కాసులవాడ' టైటిల్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, అప్పులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న పాత్రలో మనోజ్ సందడి చేయనున్నారు. దేవుడికి, భక్తుడికి మధ్య జరిగే కథ అయినప్పటికీ దీనిని సరదా టోన్ లోనే చెప్పనున్నారు.
[Jayam Ravi, Birthday Poster, Lord Venkateswara, Vaddi Kaasula Vaada, Ravi Mohan, Manchu Manoj, Telugu Film News, Telugu News]




.webp)
