మంచు మనోజ్ కు షాకిచ్చిన అఖిల్..!
on Jun 6, 2016
ఏదైనా సందర్భం వచ్చినప్పుడు విష్ చేస్తూ ఒక ట్వీట్ చేసేయడం ఈజీయే. కానీ గుర్తుపెట్టుకుని బహుమతి పంపటం మాత్రం చాలా తక్కువమందే చేస్తారు. అక్కినేని అఖిల్ ఈ రెండో కోవలోకి వస్తాడని చెప్పచ్చు. విషయంలోకి వెళ్తే, నిన్న మంచుమనోజ్ పెళ్లి రోజు. గతేడాది జూన్ 5న రాకింగ్ స్టార్ తన బ్యాచిలర్ హుడ్ కు మంగళం పాడేశాడు. ఈ సందర్భంగా మనోజ్ కు హ్యాపీ వెడ్డింగ్ డే అంటూ చాలా మందే విషెస్ పంపారు. కానీ అక్కినేని అఖిల్ మాత్రం అలాస్కన్ మాలామ్యూట్ జాతికి చెందిన బుజ్జి కుక్కపిల్లను గిఫ్ట్ గా మనోజ్ కు పంపించాడు.పెళ్లి రోజున గిఫ్ట్ గా తమ ఇంటికి చేరిన నీలికళ్ల బుజ్జికుక్క పిల్లను చూసి మనోజ్ అండ్ ప్రణతి కంబైన్డ్ గా షాక్ అయ్యారట. ఆ తర్వాత తేరుకుని, ఇంత క్యూట్ గిఫ్ట్ ఇచ్చినందుకు పర్సనల్ గా కాల్ చేసి ధన్యవాదాలు తెలిపాడట మనోజ్. ఈ బుజ్జికుక్కపిల్లకు జోయా అని పేరు పెట్టారు. జోయా ఫోటో పెట్టి అందరూ మా కుటుంబంలోని కొత్త వ్యక్తికి వెల్ కం చెప్పండి అంటూ ట్వీట్ చేశాడు మనోజ్. అఖిల్ కు కూడా సేమ్ జాతి కుక్క ఉండటం విశేషం.