భలే భలే సీక్వెల్ వస్తుందా..?
on Jun 6, 2016
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ను మార్చేసిన సినిమా ' భలే భలే మగాడివోయ్ '. చిన్న హీరోల లీగ్ నుంచి న్యాచురల్ స్టార్ గా నాని ని మార్చేసిందీ ఈ సినిమా. కెరీర్లో ఓ మాదిరి హిట్స్ చాలానే ఉన్నా, స్టార్ స్టేటస్ ఇచ్చిన సినిమా ఇది. నిర్మాతగా, దర్శకుడిగా మారుతికి మంచి పేరు లాభాలు తీసుకొచ్చింది. అడల్డ్ కంటెంట్ హెవీగా ఉండే సినిమా చేస్తాడని తనకున్న పేరును ఈ సినిమాతో మారుతి చెరిపేసుకున్నాడు. తమ కెరీర్ కు చాలా హెల్ప్ అయిన ఈ సినిమా మ్యాజిక్ ను సీక్వెల్ తో మళ్లీ రిపీట్ చేద్దామనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. మారుతి ప్రస్తుతం బాబు బంగారం సినిమాతో, నాని జెంటిల్ మన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటి వరకూ టాలీవుడ్ లో సీక్వెల్ తో మ్యాజిక్ చేసిన దాఖలాలు తక్కువే. మరి మారుతి నాని కలిసి ఈ ట్రెండ్ ను మారుస్తారేమో చూద్దాం.