శ్రీలంక సైనికుడిగా మారిన మంచు మనోజ్!
on Aug 2, 2016
ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో మంచు మనోజ్ ది ప్రత్యేకమైన శైలి. "నేను మీకు తెలుసా" మొదలుకొని "శౌర్య" వరకూ మనోజ్ చాలా డిఫరెంట్ అండ్ టిపికల్ రోల్స్ ట్రై చేశాడు. అయితే వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి అనుకోండి అది వేరే విషయం. కానీ.. హిట్టు-ఫ్లాపు అనే విషయాన్ల్ని పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు మంచు మనోజ్.
ఇప్పుడు తాజాగా మనోజ్ నటిస్తున్న "ఒక్కడూ మిగలడు" అనే చిత్రంలోనూ అదే తరహాలో ఓ విభిన్న పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాలో మనోజ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనుండగా.. వాటిలో ఒకటి శ్రీలంక సైనిక బృందంలోని ఎల్.టి.టి.ఐ సభ్యుడి పాత్ర కావడం విశేషం, 1990, 2016 మధ్య జరిగే కథ కావడంతో గెటప్ లో కూడా వైవిధ్యాన్ని చూపనున్నాడట. మరి ఈమారైనా మంచు బాబుకి హిట్టు దక్కుతుందేమో చూడాలి!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
