' శౌర్య ' సినిమా పబ్లిక్ టాక్
on Mar 4, 2016
మన తెలుగు తెరపై ప్రయోగాలు రావాలని అందరూ కోరుకుంటాం. కానీ ప్రయత్నం చేయట్లేదనే బాధపడతాం. దర్శకుడు దశరథ్ కు కూడా ఇదే ఫీలింగ్ ఉన్నట్టుంది. అందుకే పెద్దగా ఫామ్ లో లేని మనోజ్ తో శౌర్య లాంటి ఒక ప్రయోగాన్ని చేశాడు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో పక్కన పెడితే, దశరథ్ చేసిన ఈ ప్రయోగాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ జానర్ లో మంచు మనోజ్ చేసిన సినిమా శౌర్య. కుటుంబ కథా సినిమాల దర్శకుడిగా పేరుబడ్డ దశరథ్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు..ఈ రోజు రిలీజయ్యే సినిమాల్లో, శౌర్య పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం రండి.
స్టోరీ
చాలా తెలివైన, బాగా చదువుకున్న కుర్రాడు శౌర్య (మంచు మనోజ్). తను ఎంతగానో ప్రేమించే నేత్ర (రెజీనా) తో కలిసి లేచిపోదామనుకుంటాడు. కానీ అదే సమయంలో అనుకోకుండా నేత్ర హత్యకు గురౌతుంది. దీనికి శౌర్య కారణమంటూ అరెస్ట్ చేస్తారు పోలీసులు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. అసలు వీరిద్దరికీ లేచిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? పొలిటీషియన్ కూతుర్ని లేపుకుపోయి ఫారిన్ లో సెటిల్ అవుదామనుకున్న శౌర్య, ఆమెను హత్య చేశాడా..? ఇంతకూ హీరో హీరోయిన్లు ప్రేమలో ఎలా పడ్డారు..? ఇదీ క్లుప్తంగా కథ.
ఎలాంటి ప్రాత్ర ఇచ్చినా తన వరకూ వంద శాతం న్యాయం చేసే ప్రకాష్ రాజ్, శౌర్యకు తనలోని నూరు శాతం నటుడ్ని బయటికి తీసుకొచ్చాడు. సినిమా హైలెట్స్ లో ఒకటిగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నిలబడుతుందని సమాచారం. ప్రభాస్ శీను ఉన్నది కాసేపైనా కడుపుబ్బా నవ్వించాడు. కేవలం 121 నిముషాల రన్ టైంతో ప్రేక్షకులకు అప్పుడే అయిపోయిందా అనిపించేలా చేస్తుంది. ఫ్యామిలీ కథలను పక్కన పెట్టి, థ్రిల్లర్ తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేద్దామనుకున్న దశరథ్ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే కానీ ఇలాంటి విభిన్నమైన సినిమా ఎంత వరకూ ఎక్కుతుందో చూడాలి
ఇలాంటి వైవిధ్యమైన కథాంశాలు, మరిన్ని తెలుగు తెరపై రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ రొటీన్ సినిమాలు ఏం చూస్తాంరా అని విసిగిపోయిన ప్రేక్షకులకు, శౌర్య చక్కని టైం పాస్. వైవిధ్యం కోరుకునే వారికి నచ్చుతుంది. అంచనాలు లేకుండా వెళ్తే మంచిది.