
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో అఖిల్ అక్కినేని ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. "ఇలాంటి మంచి ప్రాజెక్ట్ నిర్మించిన లక్ష్మణ్ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే అలాంటి కంటెంట్‌ను అందించగలగాలి. ఇప్పుడు టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రేక్షకులు థియేటర్‌లో చూడదగ్గ సినిమా అనిపిస్తుంది. ఇలాంటి నిర్మాతలు మన పరిశ్రమకు మరింతమంది కావాలి. నేను చిన్నప్పటి నుంచి సుమంత్ అన్న ఒడిలోనే పెరిగాను. నాకు ఏది కావాలన్నా ఎక్కువగా సుమంత్‌నే అడిగేవాడిని. ఒక్కరోజు కూడా ఆయన ఎప్పుడూ నాకు నో చెప్పలేదు. ఈరోజు ఆయన ఫంక్షన్‌కు వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ ఫీలింగ్. అలాగే, సిద్దుకి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. కానీ ఆయన వేరే సినిమా కోసం సపోర్ట్ చేస్తూ ఇందులో చేయడం నిజంగా అభినందనీయం. ఏదో ఒక రోజు ఆయన సినిమాలో నేను కూడా భాగం కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ సంతోష్ గారు ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి పనిచేశారు. ‘మహేంద్రగిరి వారాహి’లాంటి కంటెంట్ ఉన్న సినిమా తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఆడబోతుంది. చాలా పెద్ద హిట్ అవ్వబోతుందని నమ్మకం ఉంది. ఇంత మంచి కంటెంట్ బేస్ ఉన్న సినిమాని ఇస్తున్నందుకు టీమ్‌కి కంగ్రాజులేషన్స్. సెప్టెంబర్ 11న అందరూ థియేటర్‌లో చూడండి. మంచి కంటెంట్ ఎంజాయ్ చేయండి." అన్నారు.

హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "ముందుగా లెనిన్ తో బ్లాక్‌బస్టర్ కొట్టిన అఖిల్ గారికి కంగ్రాట్స్. ఆయన హార్డ్ వర్క్ స్క్రీన్ మీద కనిపించింది. చివరి 40 నిమిషాలు చూసి షాక్ అయ్యాను. అంత అద్భుతంగా చేశారు. ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాలో నేను చేయడానికి ప్రధాన కారణం నిర్మాత మధుగారు. మేము గతంలో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాము. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సుమంత్ గారు చాలా ఫ్రీడమ్ ఉన్న కెరీర్‌ను సెట్ చేసుకున్నారు. ఆయన ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘మహేంద్రగిరి వారాహి’ ద్వారా అద్భుతమైన సినిమా. మేమిద్దరం కలిసి చేసిన సీన్ చాలా బావుంటుంది. తనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. అనుప్ రూబెన్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో చూడండి." అన్నారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ.. "ఈ సినిమా జర్నీ మూడు సంవత్సరాల క్రితం మొదలైంది. కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద స్థాయిలో చేయాలి. అలాంటి స్థాయిలో నిర్మించే నిర్మాత కోసం చూశాం. అమ్మవారి ఆశీస్సులతో నిర్మాత మధుగారు ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. సినిమా ఒక లెవల్‌కు వచ్చింది. తర్వాత లక్ష్మణ్ గారు ఎంటర్ అయ్యారు. మరో లెవల్‌కు పెరిగింది. సినిమా ప్రమోషన్స్ కూడా చాలా విభిన్నంగా చేశాము. దాదాపు 150 థియేటర్స్ లో అమ్మవారి విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ సినిమా వెనుక ఏదో శక్తి ఉన్నట్టు మేము ఫీలయ్యాము. సెప్టెంబర్ 11న మా కష్టార్జితం మీరు తెరపై చూడబోతున్నారు. ఇందులో నేను, సిద్దు చేసిన ఒక సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్‌గా ఉంటుంది. డైరెక్టర్ సంతోష్ ఆ సన్నివేశాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. మా నిర్మాతలు ఈ సినిమా చూశారు. చూసిన తర్వాత వాళ్ల కళ్లల్లో కనిపించిన ఆనందం నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ దుమ్ముదులిపేస్తుంది. సిద్దు వచ్చిన తర్వాత సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఈ కథని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. సినిమాలో ఆయన కొత్త రూపాన్ని చూస్తారు. ఈ సినిమాకి ఆయన బరువు పెంచారు. అలీ గారితో, బ్రహ్మానందం గారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు చాలా కొత్తగా కనిపిస్తారు. పెద్ద మనవడుకి సపోర్ట్ అందించడానికి చిన్నమనవడు(అఖిల్) వచ్చాడు(నవ్వుతూ) వాడికి థాంక్స్ అని నేను చెప్పకూడదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నా ఒడిలోనే పెరిగాడు. మొన్న ‘లెనిన్ తో బ్లాక్‌బస్టర్‌తో తన సత్తా ఏంటో చూపించాడు. ‘లెనిన్’ సినిమా చూస్తున్నప్పుడు యాక్టర్‌గా నేను గర్వపడ్డాను. అంత అద్భుతంగా చేశాడు. తన సక్సెస్‌లో ఎక్కువ సంతోషపడింది నేనే. తను ఈ వేడుకకు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సెప్టెంబర్ 11న అందరూ సినిమాని థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీద నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అందరం థియేటర్స్‌లో కలుద్దాం." అన్నారు.
[Mahendragiri Varahi, Pre Release Event, Hero Sumanth, Akhil Akkineni, Siddhu Jonnalagadda, Telugu Film News, Telugu News]





