
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెలుగు చిత్రసీమలో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
తన డెబ్యూ కోసం సరైన కథను ఎంచుకునేందుకు మోక్షజ్ఞ కావాల్సిన సమయం తీసుకున్నారు. పలు కథలను విన్న తర్వాత తనకు నచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చేస్తున్న దర్శకుడు వశిష్ఠ ఈ కథను సిద్ధం చేశారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
చిత్ర బృందం బాలకృష్ణ, మోక్షజ్ఞలను కలుసుకుని, యంగ్ లయన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న కొన్ని స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్స్ మోక్షజ్ఞ స్టైలిష్‌గా, ఫిట్‌గా, చాలా హ్యాండ్సమ్ కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మోక్షజ్ఞ ఇప్పటికే ఇంటెన్స్ గా ప్రిపేర్ అయ్యారు. కమర్షియల్ హీరోకు అన్ని అంశాల్లో శిక్షణ తీసుకుంటూ ఫిజికాలిటీ, పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇస్తుండటం, వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండటం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నికల్ టీం వివరాలని మేకర్స్ వెల్లడించనున్నారు.
[Nandamuri Mokshagna Teja, Nandamuri Balakrishna, Mallidi Vassishta, Mythri Movie Makers, Telugu Film News, Telugu News]






