Home

»

Latest News

Priyanka Mohan: హీరో లేడు కానీ హిట్ కొట్టింది బాసు.. మరి ఓజి ఇచ్చిన ఎనర్జి అలాంటిది

Mar 23, 2026

 

 

-ఓటిటిలో దుమ్ము రేపుతున్న ప్రియాంక మోహన్ 
-ఇంతటి ఏంటి ఆ మూవీ 
-మీ కోసమే ఈ స్టోరీ 

హీరోలు ఉంటేనే సినిమాలు ఆడని కలికాలం. అలాంటిది హీరో లేకుండా సినిమా అంటే. అసలు ఆ ఆలోచనని కూడా ప్రస్తుతం చాలా మంది మేకర్స్ తీసుకురావడం లేదు. ప్రేక్షకులు కూడా హీరో లేని సినిమాని చూడటానికి దైర్యం చేయరేమో అని సంకోచించే పని. కానీ ఆ ఆలోచనలు మొత్తం జుజుబీ అని ఒక మూవీ నిరూపిస్తుంది. సదరు మూవీలో టైటిల్ రోల్ పోషించింది ఎవరో కాదు ప్రియాంక మోహన్(Priyanka MOhan). మరి ఆ విశేషాలేంటో చూద్దాం.
   

'మేడ్ ఇన్ కొరియా'(Made in Korea). ఈ నెల 12 న ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్(NetFilx)లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.  రిలీజ్ అయినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ మూవీ అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది. చిత్ర కథ చూసుకుంటే షేన్భా అనే యువతి   చిన్నప్పటి నుంచి కొరియా వెళ్లాలని కలలు కంటుంది. ఆ కలల్ని ఒడిసిపట్టుకుని లైఫ్ ని కొనసాగిస్తున్న తను ప్రేమలో కూడా మోసపోతుంది. కానీ వాటన్నిటిని తట్టుకొని ఆమె తన జీవితాన్ని ఎలా మలుచుకుంది? విదేశీ నేలపై తనని తాను ఎలా నిలబెట్టుకుంది? అనే భావోద్వేగ అంశాలతో కథ సాగుతుంది. షేన్భా గా ప్రియాంక పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో కొనసాగుతుంది.

Also read: Thaman: త్రివిక్రమ్, థమన్ కాంబోకి బ్రేక్.. కారణం ఇదే

మిగతా నటీనటుల పెర్ఫార్మ్ కూడా  మెప్పిస్తుంది. తమిళ, కొరియన్ నటుల మిక్స్డ్ కలయికలో రూపొందగా 'పార్క్ హై జిన్, రిషికాంత్, సై హన్ బేక్,  సోరీ కిమ్ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. రా కార్తీక్ దర్శకుడు. మరి లేటు చేయకుండా మీరు కూడా ఇంటిల్లిపాది మేడ్ ఇన్ కొరియా చూసి సినీ మాజాని సొంతం చేసుకోండి. పాన్ ఇండియా అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇందుకు మీ ఓజి(og) కన్మణి నే సాక్ష్యం.

 

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com