
- 'దురంధర్ 2'కి బిగ్ షాక్
- ఇండియా మొత్తం ఓ లెక్క, అక్కడో లెక్క
- కేరళలో 'ఆడు 3' ప్రభంజనం
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'దురంధర్ 2'(Dhurandhar 2) మూవీ సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ సునామీని తట్టుకొని మరీ ఒక చిన్న సినిమా రికార్డు కలెక్షన్స్ రాబడుతోంది. కేరళలో 'దురంధర్ 2'ని వెనక్కి నెట్టిన ఈ చిన్న సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మలయాళ హీరో జయసూర్య నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'ఆడు 3' (Aadu 3) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు థియేటర్లలో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా 'దురంధర్ 2' సునామీని తట్టుకొని, కేరళ బాక్సాఫీస్ వద్ద 'ఆడు 3' పంజా విసరడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (Dhurandhar 2 vs Aadu 3)
గత నాలుగు రోజుల్లో ఈ సినిమా సాధించిన వసూళ్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపు 56 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. కేరళలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా తన మ్యాజిక్ రిపీట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణం 'ఆడు' ఫ్రాంచైజీకి ఉన్న విపరీతమైన క్రేజ్. 2015లో వచ్చిన మొదటి పార్ట్ 'ఆడు' థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన 'ఆడు 2' భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత వచ్చిన ఈ మూడవ భాగంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో దర్శకుడు మిథున్ మాన్యుయెల్ థామస్ కొత్త ప్రయోగాన్ని చేశారు.
'ఆడు 3' సినిమాలో జయసూర్య 'షాజీ పాప్పన్' గా తన ఐకానిక్ మేనరిజమ్స్ తో మరోసారి అలరించారు. ఆయనతో పాటు వినాయకన్ (డ్యూడ్), సాయిజు కురుప్ (అరక్కల్ అబు) ల కామెడీ టైమింగ్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.
మార్చి 19న 'దురంధర్ 2'తో పాటు థియేటర్లలో అడుగుపెట్టింది 'ఆడు 3'. 'దురంధర్ 2' అన్ని చోట్లా ప్రభావం చూపుతున్నా.. కేరళ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇప్పటిదాకా 9 కోట్లే రాబట్టింది. ఇక్కడ 'ఆడు 3' భారీ వసూళ్లతో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, మలయాళంలో 'ఆడు 3' రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.






