Home

»

Latest News

Lenin: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. డేట్ జంప్ కాబోతుందా!

Apr 28, 2026

 


కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అక్కినేని వారు ఏమంటా చెప్పారో కానీ, ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ అదే పాటని పాడుకోవాల్సిన పరిస్థితి. అఖిల్(Akhil)లెనిన్ మూవీనే  ఆ సాంగ్ పాడుకునే పరిస్థితిని కల్పిస్తుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం 

లెనిన్(Lenin)జూన్ 26న రిలీజ్ కాబోతుందని మేకర్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఈ డేట్ నుంచి కూడా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు పెద్దినే కారణమని రీసెంట్ గా పెద్ది(Peddi)ని జూన్ 25 న రిలీజ్ చేస్తామని బుచ్చిబాబు ప్రకటించాడు. దీంతో నిను వీడని నీడను నేనే అనే  రీతిలో పెద్ది వెంటపడుతుండటంతో లెనిన్ రిలీజ్ డేట్ మారవచ్చనేది టాక్. నిజానికి  లెనిన్ మే 1న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ పెద్ది ఫస్ట్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 కావడంతో క్లాష్ వద్దనుకొని  జూన్ 26కి వాయిదా వేశారు. మరి ఇప్పుడు జూన్ 25నే పెద్ది బరిలో దిగబోతుంది. మరి ఒకే రోజు గ్యాప్‌లో రెండు భారీ సినిమాలు విడుదల కావడం అనేది ఇబ్బందే. ట్రేడ్ వర్గాలు సైతం క్లాష్ వద్దని అనుకుంటారు. పైగా అఖిల్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్నాడు. హిట్ కూడా కంపల్ సరి దీంతో జూన్ రేసు నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Also read: Vandemataram: షార్ట్ ఫిల్మ్ తీస్తే 15 లక్షలు.. కేంద్రం బంపర్ ఆఫర్ 

ఏది ఏమైనా రిలీజ్ డేట్ వాయిదా పడినా కూడా ఈ సారి అఖిల్ బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడటం ఖాయమనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అఖిల్ సరసన భాగ్య శ్రీ  భాగ్యశ్రీ బోర్సే జత కడుతుండగా ఇప్పటికే విడుదలైన 'వారేవా వారేవా' సాంగ్ యు ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. ఆ ఇద్దరి మధ్య కనపడ్డ కెమిస్ట్రీ  కూడా లెనిన్ పై అంచనాలని పెంచుతుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న లెనిన్ కి మురళి కిషోర్ అబ్బూరి దర్శకుడు. పక్కా యాక్షన్ డ్రామా.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com