ఈ అందాల నటి సౌత్ ఇండియన్ క్వీన్ కావాలనుకుంటుందా?
on Jan 24, 2023
బాలీవుడ్ క్వీన్ గా కంగనా రనౌత్ పేరున చెప్పుకోవాలి. ఇక దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా నయనతార పేరు ముందుగా చెప్పుకోవాల్సి వస్తుంది. అనుష్క శెట్టి కూడా నయనతారతో సరి సమానమైనప్పటికీ ఎందుకనో నయనా స్థాయికి ఎదగలేక పోయింది. తన కెరీర్లో అరుంధతి, పంచాక్షరి, భాగమతి లాంటి నాయిక ప్రధాన పాత్రలో మెప్పించిన ఈమె నిశ్శబ్దం, సైజు జీరో లాంటి ప్రయోగాలు చేసిన ఈమె నయనతారకు దరిదాపుల్లోకి వెళ్లలేక పోయింది. అలాంటి సమయంలో మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కూడా అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. క్యూట్ హీరోయిన్గా ఆమెకు ఎందరో అగ్ర హీరోలు అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆమె మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రాలంటూ వాటికే పరిమితమైపోతోంది. మహానటిలో సావిత్రి పాత్రను అద్భుతంగా పోషించడంతో ఈమెకు మంచి భవిష్యత్తు ఉందని అందరూ భావించారు. కానీ మహానటిలా అన్ని చిత్రాలు ఉండాలనుకోవడం సరికాదు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఇటీవల మణికర్ణిక, తలైవి, తాకడ్ లాంటి ప్రయోగాలతో బాగా దెబ్బతింది. తాజాగా కీర్తి సురేష్ నటిస్తున్న రివాల్వర్ రీటా పోస్టర్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అని పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. కీర్తి కి ఇది సరైన సమయం కాదని ముందుగా హీరోయిన్గా స్థిరపడి ఆ తరువాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడం బెటర్ అని కొందరు సలహా ఇస్తున్నారు. వీరిలో విమర్శకులు కూడా ఉన్నారు. కీర్తి గతంలో కూడా పెంగ్విన్, మిస్ ఇండియా, చిన్ని వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అభిమానులకు ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రాలలో ఏమీ సరిగా ఆడలేదు. ఈమెకు అందునా ఈ జోనర్ ఇప్పటివరకు కలిసి రాలేదు. దాంతో మరోసారి ఇలాంటి ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంటుందని కొందరు విమర్శిస్తున్నారు. కీర్తి కూడా కంగనాల యాక్షన్ క్వీన్ కావాలనుకుంటుందా? మరో లేడీ అమితాబ్ లా విజయశాంతి తరహాలో రెచ్చిపోవాలని చూస్తోందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం కీర్తి సురేష్ కు పేరు వచ్చిందే గాని ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు లేకపోవడం వల్లనే ఇలా చేస్తోందని సర్ది చెబుతున్నారు. మరి ఇన్ని సందేహాలకు మహానటి తన రివాల్వర్ రీటా ద్వారా ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి.