Home

»

Latest News

రౌడీ జనార్థన: కీర్తి సురేష్ బర్త్‌డే పోస్టర్ మామూలుగా లేదు.!

Oct 17, 2026 6:18PM

రీసెంట్ గా 'రణబాలి'తో ప్రేక్షకులను పలకరించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న నెక్స్ట్ మూవీ "రౌడీ జనార్థన". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది. 

ఈ రోజు హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ "రౌడీ జనార్థన" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ ట్రెడిషనల్ లుక్ లో బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. సముద్ర తీరంలో పడవలో విజయ్ తో కలిసి ఉన్న రొమాంటిక్ పోస్టర్ క్యూట్ గా ఉంది.

రౌడీ జనార్థన" సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు రౌడీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇది కూడా చదవండి: యూట్యూబ్ సెన్సేషన్ 'ఏయ్ జూడ్' హీరోగా సినిమా ప్రారంభం.! 

 

 

[Keerthy Suresh Birthday Special Poster, Rowdy Janardhana Movie, Vijay Deverakonda, Keerthy Suresh, Ravikiran Kola, Dil Raju, Ranabaali Movie, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com