దర్శకురాలు సంజనారెడ్డికి అరుదైన వ్యాధి?
Jun 10, 2020 2:16PM
.jpg)
'కరణం మల్లేశ్వరి' బయోపిక్ దర్శకురాలు సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఓవైపు ఆమెకు ఏదో జరిగిందని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వార్తలు వచ్చాయి. మరోవైపు ఆమెకు ఏమీ కాలేదని రచయిత, 'కరణం మల్లేశ్వరి' బయోపిక్ నిర్మాతలలో ఒకరైన కోన వెంకట్ స్పష్టం చేశారు. జస్ట్ జ్వరం మాత్రమే వచ్చిందని చెప్పుకొచ్చారు. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని సమాచారం.
సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో మంగళవారం ఆమెకు వెంటిలేటర్ తొలగించమని యశోదా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్పటివరకు ఆమె వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించినట్టు పరోక్షంగా చెప్పినట్టు అయింది. గురువారం వరకు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచుతున్నారని తెలిసింది. సంజనారెడ్డికి మెదడుకు సంబంధించి అరుదైన వ్యాధి వచ్చినట్టు సమాచారం. ఆమెకు బ్రెయిన్ మెనింజైటీస్ పరీక్షలు చేస్తున్నారట. వెంటిలేటర్ తొలగించినా ఆమెను ఐసీయూలో ఉంచారట.




