TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

గోడ దూకిన బాలకృష్ణ... ఎందుకంటే?

Jun 10, 2020 12:14PM


 

ఓ తండ్రిగా కుమార్తె కోసం బాలకృష్ణ ఎంత దూరమైనా వెళతారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అమ్మాయి కోసం ఆయన గోడ దూకారు. బాలకృష్ణకు గోడ దూకాల్సిన అవసరం వస్తుందని ఎవరైనా అనుకుంటారా? అసలు, ఆయన ఎందుకు గోడ దూకాల్సి వచ్చింది తెలుసా?

బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి తెలుసుగా! చిన్నతనంలో చాలా లావుగా ఉండేవారు. బరువు తగ్గాలంటే వ్యాయామం చేయాలి కదా. అందులోనూ వాకింగ్ కంపల్సరీ. అమ్మాయి చేత వాకింగ్ చేయించడం కోసం ప్రతిరోజూ ఉదయం తెల్లవారుజామున ఇంటి ముందున్న కేబీఆర్ పార్క్ కి వెళ్లేవారు. ఆ సమయంలో పార్క్ గేట్లు ఓపెన్ చేసేవారు కాదు. లోపలి వెళ్లడం కోసం అమ్మాయిని భుజాల మీద ఎక్కించుకుని పార్క్ లోపలికి దూకించేవారు. తర్వాత ఆయన గోడదూకి లోపలి వెళ్లారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అప్పట్లో సంఘటనను బ్రాహ్మణి గుర్తుచేసుకున్నారు. తండ్రి నుండి తాను క్రమశిక్షణ నేర్చుకున్నని ఆమె తెలిపారు. 

తన తండ్రి ఎన్టీఆర్ తో బాలకృష్ణ నటించారు. తండ్రి బయోపిక్ 'యన్.టి.ఆర్'లో బ్రాహ్మణి రెండో మనవడు ఆర్యవీర్ తో కలిసి నటించారు. బాలకృష్ణ పాత్రలో ఆర్యవీర్ నటించిన సంగతి తెలిసిందే. "తండ్రితోనూ, మనవాళ్లతోనూ నాన్న నటించారు. ముని మనవాళ్ళతోనూ నటిస్తానని నా నమ్మకం" అని బ్రాహ్మణి అన్నారు.

google-ad-img