సర్ ప్రైజ్.. రేపే ఓటీటీలోకి 'కాంతార'
on Nov 23, 2022
చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయాన్ని అందుకున్న కన్నడ చిత్రం 'కాంతార' ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో నవంబర్ 24 నుంచి 'కాంతార' స్ట్రీమింగ్ కానుందని ఇటీవల వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ స్ట్రీమింగ్ కి కేవలం కొద్ది గంటల ముందు అధికారిక ప్రకటన ఇచ్చింది ప్రైమ్. ఈ చిత్రం రేపటి నుంచి కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంటే ఈ అర్థరాత్రి 12 నుంచే 'కాంతార' ఓటీటీలో అందుబాటులోకి రానుందన్నమాట. 'కాంతార' హిందీ వెర్షన్ మాత్రం డిసెంబర్ మొదటి వారం నుంచి స్ట్రీమ్ అయ్యే అవకాశముందని అంటున్నారు.
హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. రిషబ్ తో పాటు సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం రెండు వారాల తర్వాత ఇతర భాషల్లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.
Also Read