రష్మితో సుధీర్ 'గజ్జెల గుర్రం'.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
on Nov 23, 2022
'గాలోడు' చిత్ర విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు సుడిగాలి సుధీర్. నవంబర్ 18న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ స్టేటస్ దక్కించుకుంది. సుధీర్ బాక్సాఫీస్ స్టామినా చూసి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. సినిమాలపై పూర్తి దృష్టి పెట్టి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని సుధీర్ అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే బుల్లితెరపై సుధీర్-రష్మి జోడీని ఇష్టపడే ఎందరో.. వాళ్ళు కలిసి సినిమా చేస్తే చూడాలనుకుంటున్నారు. అయితే త్వరలో ఈ జోడి వెండితెరపై కూడా సందడి చేయనుంది.
'గాలోడు' చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గతంలో సుధీర్ తో 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే చిత్రం చేశాడు. ఆయన ఎక్కువగా సుధీర్ తో సినిమాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నాడు. అంతేకాదు త్వరలోనే సుధీర్-రష్మి కలయికలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
'గాలోడు' చిత్రం మంచి వసూళ్ళు రాబడుతుండటంతో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తన సంతోషాన్ని పంచుకున్నాడు. అలాగే సుధీర్-రష్మి కలయికలో తాను చేయబోయే సినిమా గురించి రివీల్ చేసి సర్ ప్రైజ్ చేశాడు. నిజానికి 'సాఫ్ట్ వేర్ సుధీర్', 'గాలోడు' చిత్రాల కోసమే రష్మిని సంప్రదించామని కానీ డేట్స్ అడ్జస్ట్ కాలేదని తెలిపాడు. అయితే వారిద్దరితో 'గజ్జెల గుఱ్ఱం' అనే సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం కథగానే ఉందని, పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి కాస్త టైం పడుతుందన్నాడు. ఏదేమైనా వీలైనంత త్వరగా సుధీర్-రష్మి కలయికలో ఖచ్చితంగా సినిమా చేస్తానని రాజశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
