లిప్ లాక్ కోసం కమల్ ఆరాటం
on Nov 7, 2013
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన పుట్టినరోజు సంధర్భంగా ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. కమల్ కి ధూమపానం అలవాటు ఉంది. అయితే ఇప్పటి నుండి ఆ అలవాటును ఆపెయ్యలని అనుకుంటున్నాడు. ఇంతకీ కమల్ ఇంత మంచి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసా.. కమల్ తనకోసం ఈ నిర్ణయం తీసుకులేదంట. తనతో నటించే హీరోయిన్లతో కలిసి లిప్ లాక్ చేసినపుడు వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కమల్ ప్రస్తుతం "విశ్వరూపం-2" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.