
సూర్య(Suriya)తో వివాహం తర్వాత జ్యోతిక(Jyothika)నటనకి కొంత గ్యాప్ ఇచ్చినా సరే సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నుంచి వచ్చిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ డీటెయిల్స్ చూద్దాం.
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha),జ్యోతిక కలిసి సిస్టమ్(System)అనే వెబ్ సిరీస్ తో ఈ నెల 22 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నారు. రీసెంట్ గా సిస్టమ్ నుంచి మేకర్స్ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసారు. సదరు వీడియోలో 'న్యాయం దేవుడి లాంటిది, వెతికి పట్టుకోవడం కష్టమనే వర్డ్ ఇప్పుడు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది . దీంతో సిస్టమ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వంలో అన్యాయం, ఆశయం, అధికారం వంటి అంశాల నేపథ్యంలో కథనం ఉండబోతుంది. అశుతోష్ గోవర్కర్ , గౌరవ్ పాండే కీ రోల్స్.
Also read: Sukumar: సుకుమార్ కి కథ చెప్పడం రాదు.. ప్రముఖ హీరో షాకింగ్ కామెంట్స్







